షార్జిల్ ఇమామ్‌కు సమన్లు.. 3న హాజరు కావాలని జె‌ఎన్‌యు ఆదేశాలు

రెచ్ఛగొట్టే ప్రసంగాలు చేశాడన్న ఆరోపణపై దేశద్రోహం కేసును ఎదుర్కొంటున్న జెఎన్‌యు రీసర్చ్ స్కాలర్ షార్జిల్ ఇమామ్‌కు యూనివర్సిటీ అధికారులు సమన్లు జారీ చేశారు. ఫిబ్రవరి 3 న తమ ముందు హాజరు కావాలని, తన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని ఈ వర్సిటీ చీఫ్ ప్రోక్టర్ ఈ సమన్లలో కోరారు.  షాహీన్ బాగ్ నిరసన ప్రదర్శనలను నిర్వహించిన ఆర్గనైజర్లలో ఒకరైన ఇమామ్.. అస్సాంను, ఈశాన్య ప్రాంతాన్ని ఈ దేశ భూభాగం నుంచి వేరు చేయాలని  సంచలనాత్మక వ్యాఖ్యలు చేసిన […]

షార్జిల్ ఇమామ్‌కు సమన్లు.. 3న హాజరు కావాలని జె‌ఎన్‌యు ఆదేశాలు
Follow us

| Edited By:

Updated on: Jan 28, 2020 | 1:26 PM

రెచ్ఛగొట్టే ప్రసంగాలు చేశాడన్న ఆరోపణపై దేశద్రోహం కేసును ఎదుర్కొంటున్న జెఎన్‌యు రీసర్చ్ స్కాలర్ షార్జిల్ ఇమామ్‌కు యూనివర్సిటీ అధికారులు సమన్లు జారీ చేశారు. ఫిబ్రవరి 3 న తమ ముందు హాజరు కావాలని, తన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని ఈ వర్సిటీ చీఫ్ ప్రోక్టర్ ఈ సమన్లలో కోరారు.  షాహీన్ బాగ్ నిరసన ప్రదర్శనలను నిర్వహించిన ఆర్గనైజర్లలో ఒకరైన ఇమామ్.. అస్సాంను, ఈశాన్య ప్రాంతాన్ని ఈ దేశ భూభాగం నుంచి వేరు చేయాలని  సంచలనాత్మక వ్యాఖ్యలు చేసిన సంగతి విదితమే. ఇతనిపై ఢిల్లీ, యూపీ, బీహార్, మణిపూర్ సహా మరికొన్ని రాష్టాల్లో ఏడు ఎఫ్‌ఐఆర్‌లు దాఖలయ్యాయి. వచ్ఛేనెల 3న ఇమామ్ ప్రోక్టోరియల్ కమిటీ ముందు హాజరై తన వాదనను వినిపించాల్సి ఉంటుంది. అయితే పరారీలో ఉన్న ఇతని కోసం ఢిల్లీ క్రైమ్ బ్రాంచి పోలీసులు అయిదు బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. ఇలా ఉండగా ఇతని సోదరుడిని బీహార్ లోని జెహానాబాద్ పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు.  కాకో గ్రామంలోని ఇమామ్ పూర్వీకుల ఇంటి నుంచి ఇతనిని అదుపులోకి తీసుకున్నారు. ఆ ఇంటి నుంచి ఇమామ్ బంధువులైన ముగ్గురిని అరెస్టు చేసి విచారించినప్పటికీ ఆ తరువాత వదిలివేశారు.