Petrol Diesel Prices: పెట్రోల్ ధరలపై సుబ్రహ్మణ్య స్వామి ట్విట్.. రావ‌ణుడి లంక‌లో పెట్రోల్ రూ.51 అంటూ ప్రభుత్వంపై సెటైర్

|

Feb 02, 2021 | 5:44 PM

బీజేపీ సీనియర్ నేత, ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి మరోసారి వార్తల్లో నిలిచారు. ఎవరిపైనైనా నేరుగా ఘాటైన వ్యాఖ్యలు చేసే సుబ్రహ్మణ్య స్వామి ఈ సారి ఏకంగా తమ ప్రభుత్వాన్నే..

Petrol Diesel Prices: పెట్రోల్ ధరలపై సుబ్రహ్మణ్య స్వామి ట్విట్.. రావ‌ణుడి లంక‌లో పెట్రోల్ రూ.51 అంటూ ప్రభుత్వంపై సెటైర్
Follow us on

Subramanian Swamy comments: బీజేపీ సీనియర్ నేత, ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి మరోసారి వార్తల్లో నిలిచారు. ఎవరిపైనైనా నేరుగా ఘాటైన వ్యాఖ్యలు చేసే సుబ్రహ్మణ్య స్వామి ఈ సారి ఏకంగా తమ ప్రభుత్వాన్నే టార్గేట్ చేశారు. ఈ మధ్య కాలంలో తరుచూ పెరుగుతున్న పెట్రో ధరల గురించి మోదీ ప్రభుత్వాన్ని ఎద్దెవా చేస్తూ స్వామి ట్విట్ చేశారు. ‘‘రాముడి జన్మభూమి అయిన భారతదేశంలో లీటల్ పెట్రోల్ ధర 93 రూపాయలైతే.. సీత పుట్టిన నేపాల్‌లో రూ. 53 ఉందని.. రావణుడి శ్రీలంకలో కేవలం 51 రూపాయలు మాత్రమే ఉంది’’ అంటూ ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ మేరకు ఆయన ఓ ఫోటోను షేర్ చేశారు.

దేశంలో గత కొన్ని రోజుల నుంచి ఇంధన ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇటీవల రాజస్థాన్‌లో పెట్రోల్ ధరలు ఏకంగా రూ.100మార్క్ దాటింది. ఇప్పటికీ భారీగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్యుడి పరిస్థితి గందరగోళంగా మారింది. దీంతోపాటు ఇంధన ధరలపై కొత్తగా సెస్ కూడా విధించనున్నట్లు ప్రభుత్వం సోమవారం పేర్కొంది. ఈ తరుణంలోనే పెట్రో ధ‌ర‌ల‌పై అధికార పార్టీ ఎంపీయే ఇలాంటి ట్విట్ చేయడంపై దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Also Read:

Digital Voter ID Card: అందుబాటులోకి డిజిటల్ ఓటర్ కార్డు.. ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో తెలుసా..?

Mamata Banerjee Dance: సామూహిక పెళ్లిళ్ల వేళ, గిరిజన యువతులతో కలిసి డ్యాన్స్ చేసిన మమతా బెనర్జీ