Digital Voter ID Card: అందుబాటులోకి డిజిటల్ ఓటర్ కార్డు.. ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో తెలుసా..?

Digital Voter ID Card: మీకు ఓటు హక్కు ఉందా.. అయితే మీకు శుభవార్తే.. ఎందుకంటే మీకు మీరే మొబైల్ ఫోన్‌లో సులభంగా ఓటర్ ఐడీ కార్డును డౌన్‌లోడ్..

Digital Voter ID Card: అందుబాటులోకి డిజిటల్ ఓటర్ కార్డు.. ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో తెలుసా..?
Follow us

|

Updated on: Feb 02, 2021 | 4:26 PM

Digital Voter ID Card: మీకు ఓటు హక్కు ఉందా.. అయితే మీకు శుభవార్తే.. ఎందుకంటే మీకు మీరే మొబైల్ ఫోన్‌లో సులభంగా ఓటర్ ఐడీ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.. ఆ కార్డును చూపించి ఓటు కూడా వేయొచ్చు.. గుర్తింపు కార్డుగా కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ ఐడెంటిటీ కార్డు ఎలక్ట్రానిక్ వెర్షన్‌ ఈఎపిక్ (EEPIC) ను అందుబాటులోకి తీసుకువచ్చింది. EEPIC సేవల ద్వారా మీ మొబైల్ ఫోన్ లేదా కంప్యూటర్ ద్వారా సులభంగా ఓటర్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డిజిటల్ లాకర్‌లో సేవ్ చేసుకోవడంతోపాటు పీడీఎఫ్ ఫార్మాట్‌లో ప్రింట్ కూడా తీసుకోవచ్చు. అయితే దీనిలో మార్పులు చేయడానికి వీలుండదు.

ఓటరు ఐడీ కార్డులను డిజిటలైజేషన్ చేసే క్రమంలో భాగంగా ఓ కొత్త ప్రయోగాన్ని చేపట్టినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. త్వరలో జరగబోయే అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ డిజిటల్ ఓటరు కార్డు కీలకంగా మారుతుందని పేర్కొంటున్నారు. మొబైల్ నెంబర్‌కు ఓటర్ కార్డు అనుసంధానమై ఉంటే మార్పులు కూడా చేసుకోవచ్చిని అధికారులు చెబుతున్నారు. ఓటరు కార్డు డిజిటలైజేషన్ ప్రక్రియ జనవరి 25 నుంచి జనవరి 31 మొదటి సారి జరిగింది. రెండోవిడత ప్రక్రియ ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభమైంది.

మీరు డిజిటల్ ఓటర్ కార్డు పొందాలనుకుంటే..

https://www.nvsp.in/ అనే వెబ్‌సైట్‌లో లాగిన్ కావాలి. అనంతరం డౌన్‌లోడ్ EEPIC మీద క్లిక్ చేసి టిజిటల్ కార్డును పొందవచ్చు. మొబైల్ నెంబర్ లింక్ అయ్యి ఉంటేనే కార్డు డౌన్‌లోడ్ అవుతుంది. లేకపోతే.. ఈకేవైసీపై క్లిక్ చేసి మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఓటర్ కార్డులో తప్పులు ఉన్నా, రిప్లేస్‌మెంట్ పొందాలన్నా దీనిలో పూర్తి చేసుకోవచ్చు. అనంతరం ఈ కాపీని డౌన్ లోడ్ చేసుకుని ఫోన్‌లో కూడా సేవ్ చేసి ఉంచుకోవచ్చు. జిరాక్స్ కాపీ అవసరం లేకుండా దీన్ని మొబైల్ లో చూపించి దీనిని గుర్తింపు కార్డుగా ఉపయోగించుకోవచ్చు.

Also Read:

భక్తిలో మునిగి తేలుతున్న సంయుక్త
భక్తిలో మునిగి తేలుతున్న సంయుక్త
దృశ్యం సినిమాను తలపిస్తున్న వడ్డే ఎల్లయ్య మిస్సింగ్ మిస్టరీ..?
దృశ్యం సినిమాను తలపిస్తున్న వడ్డే ఎల్లయ్య మిస్సింగ్ మిస్టరీ..?
మల్లీశ్వరి సినిమాకు కత్రినా ఎంత రెమ్యునరేషన్ అందుకుందో తెలుసా..
మల్లీశ్వరి సినిమాకు కత్రినా ఎంత రెమ్యునరేషన్ అందుకుందో తెలుసా..
సిక్సర్ల సునామీతో రెచ్చిపోయిన మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్..
సిక్సర్ల సునామీతో రెచ్చిపోయిన మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్..
కొవ్వు మంచిదే.. ఈ 4 ఆహారాలు శరీరానికి బ్రహ్మాస్త్రాలు..
కొవ్వు మంచిదే.. ఈ 4 ఆహారాలు శరీరానికి బ్రహ్మాస్త్రాలు..
చిన్న సమస్యకే కలత చెందుతున్నారా? మానసికంగా దృఢంగా ఉండాలంటే..
చిన్న సమస్యకే కలత చెందుతున్నారా? మానసికంగా దృఢంగా ఉండాలంటే..
డ్రై స్కిన్ కారణంగా వయసు కన్నా ముందుగానే వృద్ధాప్యం..!
డ్రై స్కిన్ కారణంగా వయసు కన్నా ముందుగానే వృద్ధాప్యం..!
కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ ప్రధాని మోదీ
కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ ప్రధాని మోదీ
రిజర్వేషన్లపై ఆర్ఎస్‌ఎస్ చీఫ్‌ మోహన్‌ భగవత్ కీలక వ్యాఖ్యలు
రిజర్వేషన్లపై ఆర్ఎస్‌ఎస్ చీఫ్‌ మోహన్‌ భగవత్ కీలక వ్యాఖ్యలు
6 అర్థ శతకాలు.. 6సార్లు ఓడిన ముంబై ఇండియన్స్.. తిలక్‌పై ట్రోల్స్
6 అర్థ శతకాలు.. 6సార్లు ఓడిన ముంబై ఇండియన్స్.. తిలక్‌పై ట్రోల్స్