కాశ్మీరీ పండిట్లు ఎక్కడివారు ? ఎప్పటివారు ?

|

Aug 05, 2019 | 3:12 PM

కశ్మీర్ విషయంలో ఆ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తికి వీలు కల్పిస్తున్న 370 ఆర్టికల్ ని కేంద్రం రద్దు చేసిన నేపథ్యంలో ఇక ఇప్పటివరకు ఈ రాష్ట్ర జనాభాలో ప్రత్యేక వర్గంగా ఉంటూ వచ్చిన కాశ్మీరీ పండిట్ల గురించి కూడా చెప్పుకోవలసిందే.. ఒకప్పుడు కాశ్మీరీ బ్రాహ్మణులుగా కూడా వీరిని వ్యవహరించేవారు. తొలుత ముస్లిముల ప్రాబల్యానికి ముందు వీరు ఈ రాష్ట్రంలో ‘ హిందూ కమ్యూనిటీగా ‘ నివసిస్తూ వచ్చారు. అయితే క్రమంగా ముస్లిముల ప్రభావం పెరగడంతో అనేకమంది ఈ […]

కాశ్మీరీ పండిట్లు ఎక్కడివారు ? ఎప్పటివారు ?
Follow us on

కశ్మీర్ విషయంలో ఆ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తికి వీలు కల్పిస్తున్న 370 ఆర్టికల్ ని కేంద్రం రద్దు చేసిన నేపథ్యంలో ఇక ఇప్పటివరకు ఈ రాష్ట్ర జనాభాలో ప్రత్యేక వర్గంగా ఉంటూ వచ్చిన కాశ్మీరీ పండిట్ల గురించి కూడా చెప్పుకోవలసిందే.. ఒకప్పుడు కాశ్మీరీ బ్రాహ్మణులుగా కూడా వీరిని వ్యవహరించేవారు. తొలుత ముస్లిముల ప్రాబల్యానికి ముందు వీరు ఈ రాష్ట్రంలో ‘ హిందూ కమ్యూనిటీగా ‘ నివసిస్తూ వచ్చారు. అయితే క్రమంగా ముస్లిముల ప్రభావం పెరగడంతో అనేకమంది ఈ మతంలోకి మారుతూ వచ్చారు. కొద్దిమందిని ఆయా ప్రభుత్వాలు కాశ్మీరీ హిందూ వర్గీయులుగా పరిగణించాయి. అలాగే అక్కడి సమాజం కూడా. 1557 లో నాడు కాశ్మీర్ ను ఆక్రమించిన అక్బర్ చక్రవర్తి.. వీరిని కూడా గౌరవించాడు. వీరి సంస్కృతి, ఆచార వ్యవహారాలు, తెలివితేటలు ఆయనను ఆకర్షించడంతో వీరికి ‘ పండిట్లు ‘ అంటూ దాదాపు బిరుదువంటిదిచ్చాడు. ఆ తరువాత ఆఫ్ఘన్లు ఈ ప్రాంతాన్ని ఆక్రమించినప్పటికీ వీరిని కాశ్మీరీ పండిట్లుగానే పరిగణించేవారు. అయితే బహుశా వారి ప్రభావంతో చాలామంది ఇస్లామ్ మతంలోకి మారిపోయారు. క్రమేపీ స్థానికులు, మిలిటెంట్ల హెచ్ఛరికలతో,పెద్ద సంఖ్యలో కాశ్మీరీ పండిట్లు వలసపోవడం ప్రారంభమైంది. 1950 ప్రాంతంలో భూసంస్కరణలకు నాటి ప్రభుత్వం పూనుకొన్నప్పుడు స్థానికులు వీరికి ఆ ప్రయోజనాలు లభించకుండా అడ్డుపడ్డారు. ఒకవిధమైన వ్యతిరేక ఉద్యమం పెల్లుబుకడంతో చాలామంది సమీప రాష్ట్రాలకు వలస వెళ్లాల్సివచ్చింది. 1981లో వీరి జనాభా కాశ్మీర్ లో అయిదు శాతానికి తగ్గిపోయింది. ఆ తరువాత ఈ వర్గాన్ని ముఖ్యంగా ముస్లిములు ‘ కాఫిర్లు ‘ గా వ్యవహరించేవారు. వారి బెదిరింపుల ఫలితంగా మహారాష్ట్రకు వలస వఛ్చిన వారిని బాలథాక్రే ఆదుకోవడం విశేషం. తమ రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో వారి పిల్లలకు కొన్ని సీట్లు రిజర్వ్ చేసిన ఘనత పొందారు. అయితే 2008 లో అప్పటి యూపీఏ ప్రభుత్వం కాశ్మీర్ కు తిరిగి వచ్ఛే యువ కాశ్మీరీ పండిట్లకు 1168 కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. దీంతో చాలామంది తిరిగి ఈ రాష్ట్రానికి చేరుకున్నారు. ప్రస్తుతం కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో ఈ పండిట్ల భవితవ్యం ఎలా మారుతుందో చూడాలి.