PM Narendra Modi: రూపుదిద్దుకుంటోన్న సరికొత్త భారతం.. మోదీ 8 ఏళ్ల పాలనలో జరిగిన అద్భుత నిర్మాణాలు..

PM Narendra Modi: రూపుదిద్దుకుంటోన్న సరికొత్త భారతం.. మోదీ 8 ఏళ్ల పాలనలో జరిగిన అద్భుత నిర్మాణాలు..

PM Narendra Modi: నరేంద్ర మోదీ దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసి 8 ఏళ్లు కావోస్తోంది. ఈ ఎనిమిదేళ్ల పాలనలో దేశ రక్షణ, సంక్షేమ పథకాలు, డిజిటల్‌ ఇండియా వైపుగా దేశం వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే...

Narender Vaitla

| Edited By: Janardhan Veluru

May 27, 2022 | 10:04 AM

PM Narendra Modi: నరేంద్ర మోదీ దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసి 8 ఏళ్లు కావోస్తోంది. ఈ ఎనిమిదేళ్ల పాలనలో దేశ రక్షణ, సంక్షేమ పథకాలు, డిజిటల్‌ ఇండియా వైపుగా దేశం వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే దేశ గౌరవం అంతర్జాతీయంగా వెలుగొందేలా కొన్ని నిర్మాణాలు కూడా జరిగాయి. ఇలా మోదీ 8 ఏళ్ల పాలనలో దేశంలో జరిగిన కొన్ని అద్భుత నిర్మాణాలపై ఓ లుక్కేయండి..

స్టాట్యూ ఆఫ్‌ యూనిటీ..

గుజరాత్‌లోని నర్మదా జిల్లాలో సర్దార్‌ సరోవర్‌ డ్యామ్‌ సమీపంలో నిర్మించిన ఈ కట్టడం ప్రపంచాన్ని ఆకర్షించింది. 2018లో అక్టోబర్‌లో ఈ నిర్మాణాన్ని చేపట్టారు. దేశ స్వాతంత్ర్యం కోసం అలుపెరగని కృషి చేసిన సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ గౌరవార్థం నిర్మించిన 182 మీటర్ల ఎత్తైన భారీ నిర్మాణం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహంగా రికార్డుల్లోకి ఎక్కింది. ఈ నిర్మాణం అమెరికాలో ఉన్న స్టాచ్చూ ఆఫ్‌ లిబర్టీ కంటే రెండు రెట్లు ఎక్కువ ఎత్తు కావడం విశేషం. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టుకు రూ. 2,389 కోట్లు ఖర్చు చేశారు. ఈ నిర్మానానికి 25,000 టన్నుల ఇనుము, 90,000 టన్నుల సిమెంట్‌ను వినియోగించారు. 3400 మంది కార్మికులు, 250 మంది ఇంజనీర్లు పనిచేశారు. ప్రస్తుతం ఈ ప్రదేశం దేశంలో అత్యుత్త పర్యాటక ప్రదేశాల్లో ఒకటిగా విరాసిలస్లోంది. ప్రపంచ నలుమూలల నుంచి ఈ నిర్మాణాన్ని చూడడానికి పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తున్నారు.

బోగీబీల్ వంతెన..

బ్రహ్మపుత్ర నదిపై 4.94 కిలోమీర్ల పొడవుతో నిర్మించిన ప్రతిష్టాత్మకమైన బ్రిడ్జ్‌ను మోదీ ప్రారంభించారు. ఆసియాలోనే రెండో పొడవైన రైల్‌కమ్‌రోడ్‌ వంతెనగా ఇది పేరుగాంచింది. ఈ బ్రిడ్జ్‌ ద్వారా అస్సాంలోని టిన్సుకియా నుంచి అరుణాచల్‌ ప్రదేశ్‌లోని నహర్లాగన్‌ పట్టణానికి మధ్య సమయాన్ని 10 గంటలకుపైగా తగ్గిస్తుంది. ఈ నిర్మాణానికి కేంద్రం రూ. 5,920 కోట్లను ఖర్చు చేసింది.

అటల్‌ టన్నెల్‌..

మోదీ హయంలో నిర్మితమైన మరో అద్భుత ప్రాజెక్ట్‌ అటల్‌ టన్నెల్‌. ఈ ప్రాజెక్ట్‌ను మోదీ 2020 అక్టోబర్‌లో ప్రారంభించారు. 10,000 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో 9.02 కి.మీ సొరంగ మార్గాన్ని నిర్మించారు. మనాలిని, లాహౌల్‌తో కలుపుతూ నిర్మించిన ఈ టన్నెల్‌ వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. లండన్‌ తనకవాత అంత ఎత్తులో నిర్మించిన అతిపొడవైన సింగిల్‌ ట్యూట్‌ హైవేగా పేరుగాంచిందీ నిర్మాణం. ఈ నిర్మాణానికి ఏకంగా రూ. 3,200 కోట్లను కేంద్రం ఖర్చుచేసింది. దీని ద్వారా 2 గంటల ప్రయాణ సమయం ఆదా అవుతుంది.

ఆదిశంకరాచార్య విగ్రహం..

మౌలిక వసతులతో పాటు ఆధ్యాత్మికానికి సంబంధించిన నిర్మాణాలకు కూడా మోదీ ప్రభుత్వం పెద్ద పీట వేసింది. ఇందులో భాగంగా నిర్మించిందే ఆదిశంకరాచార్య విగ్రహం. కేదార్‌నాథ్‌లో 12 అడుగలు ఎత్తైన ఈ విగ్రహాన్ని మోదీ 2021 నవంబర్‌ 5న ఆవిష్కరించారు. 2013 వరదల సమయంలో భారీ నష్టాని చవిచూసిన తర్వాత ఆ ప్రాంతాన్ని అభివృద్ది చేశారు.

కాశీ విశ్వనాథ్‌ కారిడార్‌..

దేశ వ్యాప్తంగా హిందూవులకు కాశీతో విడదీయరాని అనుబంధం ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే మోదీ కాశీ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిపెట్టారు. ఇందులో భాగంగానే 2021 డిసెంబర్‌లో వారణాసిలో రూ. 700 కోట్లతో కాశీ విశ్శనాథ్‌ కారిడార్‌ను ప్రారంభించారు. పురాతన నగరానికి కొత్త శోభను తీసుకొచ్చారు. అప్పటి వరకు ఇరుకు ఇరుకు సందులతో ఉండే కాశీ పట్టణం విశాలంగా మారింది. ప్రాజెక్టులో భాగంగా ఆలయ పరిసర ప్రాంతాలను 3000 నుంచి 5 లక్షల చదరపు అడుగులకు విస్తరించారు.

నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు..

ఆయోధ్య రామమందిరం..

హిందువుల ఎన్నో ఏళ్ల కల రామ మందిరం నిర్మాణాన్ని సుసాధ్యం చేశారు ప్రధాని నరేంద్ర మోది. తనదైన దౌత్య నీతిని ప్రదర్శించి ఆయోధ్యలో రామమందిరం నిర్మాణం కోసం అందరినీ ఒప్పించారు. ఇలా రామ మందిర నిర్మాణానికి పునాది వేసి దేశ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.

చీనాబ్‌ వంతెన..

ప్రపంచంంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనగా పేరుగాంచిన చీనాబ్‌ వంతెన్‌ నిర్మాణం జరుపుకుటోంది. కశ్మీర్‌ లోయకు అనుసంధానిస్తూ నిర్మితమవుతోన్న ఈ వంతెన పొడవు 1,315 మీటర్లు. ఇది ఫ్రాన్స్‌లోని ఈఫిల్‌ టవర్‌ కంటే 35 మీటర్లు ఎక్కువ ఎత్తు.

కొత్త పార్లమెంట్‌ భవనం..

మోదీ హయాంలో జరుగుతోన్న మరో అద్భుత నిర్మాణం కొత్త పార్లమెంట్ భవనం. 2020లో ఈ నిర్మాణం ప్రారంభమైంది. 1224 మంది సీటింగ్‌ కెపాసిటీతో నిర్మిస్తున్న ఈ నిర్మాణం కోసం రూ. 970 కోట్లు ఖర్చు చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu