AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tamil Nadu: తమిళ భాష, సంస్కృతుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం.. ప్రధాని మోదీ

హైదరాబాద్(Hyderabad) పర్యటన ముంగిచుకున్న తరువాత ప్రధాని మోదీ తమిళనాడు రాజధాని చెన్నైకు(Chennai) చేరుకున్నారు. దాదాపు 31 వేల కోట్ల రూపాయలకు పైగా నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. తమిళ భాష,....

Tamil Nadu: తమిళ భాష, సంస్కృతుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం.. ప్రధాని మోదీ
Modi
Ganesh Mudavath
|

Updated on: May 26, 2022 | 9:49 PM

Share

హైదరాబాద్(Hyderabad) పర్యటన ముంగిచుకున్న తరువాత ప్రధాని మోదీ తమిళనాడు రాజధాని చెన్నైకు(Chennai) చేరుకున్నారు. దాదాపు 31 వేల కోట్ల రూపాయలకు పైగా నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. తమిళ భాష, సంస్కృతులపై ప్రశంసలు కురిపించారు. తమిళ భాష శాశ్వతమైనదని అన్నారు. అన్ని రంగాల్లో తమిళనాడువాసులు ప్రతిభ కనబరుస్తున్నారని మోదీ అన్నారు. తమిళ భాష, సంస్కృతుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్న ప్రధాని.. ఈ జనవరిలో సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ క్లాసికల్‌ తమిళ్‌ కొత్త క్యాంపస్‌ను ప్రారంభించామన్నారు. దేశంలోని పలు చోట్ల మల్టీ మోడల్‌ లాజిస్టిక్‌ పార్కులను అభివృద్ధి చేసి వాణిజ్య వ్యవస్థలో కీలక మార్పును తీసుకొస్తామని వివరించారు. తద్వారా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని వెల్లడించారు. మౌలికవసతుల కల్పనకు ప్రాధాన్యత ఇచ్చిన దేశాలు.. అభివృద్ధి చెందుతున్న దశ నుంచి అభివృద్ధి చెందిన దేశాలుగా మారాయని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు.

తీవ్ర ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న శ్రీలంకను ఆదుకున్నాం. అక్కడి క్లిష్ట పరిస్థితులతో తమిళ ప్రజలు ఆందోళన చెందుతున్నారని మాకు అర్థమైంది. పొరుగున ఉన్న భారత్‌కు సన్నిహిత దేశమైన శ్రీలంక ఆర్థిక సహాయంతో పాటు ఆహారం, ఔషధాలను అందిస్తున్నాం. బెంగళూరు- చెన్నై మధ్య ఎక్స్‌ప్రెస్‌వే రెండు కీలక అభివృద్ధి కేంద్రాలను కలుపుతోంది. చెన్నై పోర్ట్‌ను మధురవాయల్‌కు అనుసంధానించే నాలుగు లైన్ల ఎలివేటెడ్ రహదారి చెన్నై పోర్టును మరింత సమర్థంగా తీర్చిదిద్దుతాం. ఇది చెన్నై నగరంలో ట్రాఫిక్‌ను నియంత్రిస్తుంది.

 – ప్రధాని నరేంద్ర మోదీ

ఇవి కూడా చదవండి

డీఎంకే సారథ్యంలో తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా ప్రధాని మోదీ తమిళనాడు పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు సీఎం స్టాలిన్‌ ఘనస్వాగతం పలికారు. ప్రధాని పర్యటనతో చెన్నైలో దాదాపు 20వేల మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పలు చోట్ల ట్రాఫిక్‌ను మళ్లించారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
గ్రీక్ యోగర్ట్ వర్సెస్ వే ప్రోటీన్.. తమన్నా ట్రైనర్ చెప్పేదిదే?
గ్రీక్ యోగర్ట్ వర్సెస్ వే ప్రోటీన్.. తమన్నా ట్రైనర్ చెప్పేదిదే?
వామ్మో.. రికార్డ్‌ స్థాయికి బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?
వామ్మో.. రికార్డ్‌ స్థాయికి బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?
గ్రేట్.. కంపెనీ అమ్మేసి ఒక్కో ఉద్యోగికి రూ. 4కోట్లు ఇస్తున్నCEO
గ్రేట్.. కంపెనీ అమ్మేసి ఒక్కో ఉద్యోగికి రూ. 4కోట్లు ఇస్తున్నCEO