పరుగులు వీరుడికి కేంద్ర మంత్రి హామీ..

మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాకు చెందిన రామేశ్వర్ అనే యువకుడు ఇప్పుడు దేశం మొత్తాన్ని ఆకర్షిస్తున్నాడు. కనీసం చెప్పులు కూడా లేకుండా 100మీటర్ల పరుగును 11 సెకన్లలో చేధించే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రన్నింగ్‌లో మంచి ప్రతిభ ఉన్న రామేశ్వర్ తన పరుగును సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశాడు. అది కాస్తా వైరల్‌గా మారి మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ దృష్టికి వెళ్లింది. దీంతో ఆ వీడియోను ట్విటర్‌లో కేంద్ర క్రీడాశాఖ మంత్రి […]

పరుగులు వీరుడికి కేంద్ర మంత్రి హామీ..

Edited By:

Updated on: Aug 18, 2019 | 2:43 PM

మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాకు చెందిన రామేశ్వర్ అనే యువకుడు ఇప్పుడు దేశం మొత్తాన్ని ఆకర్షిస్తున్నాడు. కనీసం చెప్పులు కూడా లేకుండా 100మీటర్ల పరుగును 11 సెకన్లలో చేధించే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రన్నింగ్‌లో మంచి ప్రతిభ ఉన్న రామేశ్వర్ తన పరుగును సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశాడు. అది కాస్తా వైరల్‌గా మారి మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ దృష్టికి వెళ్లింది. దీంతో ఆ వీడియోను ట్విటర్‌లో కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్‌రిజుజుకి ట్యాగ్‌ చేస్తూ చౌహాన్ పోస్ట్‌ చేశారు.

భారత్‌లో వ్యక్తిగత నైపుణ్యానికి కొదవలేదని . వారికి సరైన వేదిక దొరికినప్పుడు నిరూపించుకుంటూనే ఉన్నారని కామెంట్ చేశారు. పరుగుపందెంలో ఈ యువకుడు మంచి ప్రతిభ కనబరుస్తున్నాడని, ప్రోత్సహిస్తే దేశానికి పేరు తీసుకురాగలడన్న నమ్మకముందని రిజుజుకి ట్యాగ్‌ చేశారు.  ఈ ట్వీట్ చూసిన రిజుజు అతడిని ఎలాగైనా నా వద్దకు పంపించండి, తప్పకుండా అతడిని అథ్లెటిక్స్‌ అకాడమీలో చేర్పించి ఇంకా మెరుగయ్యేలా మంచి శిక్షణ ఇప్పిస్తానంటూ హామీ ఇచ్చారు.