Amarnath Yatra 2024: అమర్‌నాథ్‌ యాత్రకు గట్టి భద్రత.. బేస్‌క్యాంప్‌ దగ్గర మాక్‌డ్రిల్‌

అమర్‌నాథ్‌ యాత్ర ప్రశాంతంగా సాగేలా కేంద్రం భద్రతా చర్యలు చేపట్టింది. ఈనెల 29 తేదీ నుంచి యాత్ర ప్రారంభమవుతుంది. మరోవైపు ఈనెల 20, 21 తేదీల్లో జమ్ముకశ్మీర్‌లో పర్యటిస్తారు ప్రధాని మోదీ. యోగా డే వేడుకల్లో పాల్గొంటారు.

Amarnath Yatra 2024: అమర్‌నాథ్‌ యాత్రకు గట్టి భద్రత.. బేస్‌క్యాంప్‌ దగ్గర మాక్‌డ్రిల్‌
Amarnath Yatra 2024

Updated on: Jun 18, 2024 | 8:10 PM

అమర్‌నాథ్‌ యాత్రకు గట్టి భద్రత కల్పిస్తోంది కేంద్రం. ఈనెల 29వ తేదీ నుంచి అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభమవుతుంది. అయితే రియాసిలో కొద్దిరోజుల క్రితం టూరిస్టుల బస్సును ఉగ్రవాదులు టార్గెట్‌ చేయడంతో ఈసారి భద్రతను రెట్టింపు చేస్తున్నారు. జమ్ము లోని భగవతి నగర్‌లో ఉన్న బేస్‌ క్యాంప్‌ దగ్గర మాక్‌డ్రిల్ నిర్వహించారు. జమ్ముకశ్మీర్‌ పోలీసులతో పాటు ఆర్మీ జవాన్లు ఈ మాక్‌డ్రిల్‌లో పాల్గొన్నారు. జమ్ముకశ్మీర్‌ స్పెషల్‌ ఆపరేషన్స్‌ గ్రూప్‌ , క్విక్‌ రియాక్షన్‌ టీమ్‌ కమెండోలు ఈ మాక్‌డ్రిల్‌లో పాల్గొన్నారు. అమర్‌నాథ్‌ యాత్రికులపై ఉగ్రవాదులు దాడి చేస్తే ఎలా తిప్పికొట్టాలన్న విషయంపై మాక్‌డ్రిల్‌లో శిక్షణ ఇచ్చారు. రియాసిలో జరిగిన ఉగ్రదాడిలో 9 మంది టూరిస్టులు చనిపోయారు. గత వారం రోజులుగా జమ్ముకశ్మీర్‌లో వరుస ఉగ్రదాడులు కలకలం రేపుతున్నాయి. జమ్ముకశ్మీర్‌లో శాంతిభద్రతలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అమర్‌నాథ్‌ యాత్రకు గట్టి భద్రత కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు.

ప్రధాని మోదీ కూడా ఈనెల 20వ తేదీన జమ్ముకశ్మీర్‌లో పర్యటిస్తున్నారు. శ్రీనగర్‌లో జూన్‌ 21వ తేదీన యోగా డే వేడుకలకు ఆయన హాజరవుతున్నారు. శ్రీనగర్‌లో యువ సమ్మేళనానికి కూడా ప్రధాని హాజరవుతారు. ప్రధాని పర్యటన సందర్భంగా జమ్ముకశ్మీర్‌లో గట్టి భద్రతా చర్యలు చేపట్టారు. రెండు రోజుల పాటు కశ్మీర్‌లో ప్రధాని పర్యటన కొనసాగుతుంది. మూడోసారి ప్రధాని పగ్గాలు చేపట్టాక జమ్ముకశ్మీర్‌లో తొలిసారి ఆయన పర్యటిస్తున్నారు.

అమర్‌నాథ్‌ యాత్ర 45 రోజుల పాటు కొనసాగనుంది. యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. జమ్ముకశ్మీర్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రధాని మోదీ అక్కడ పర్యటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రధాని పర్యటనతో రాష్ట్రంలో పొలిటికల్‌ హీట్‌ పెరిగే అవకాశ ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..