SpiceJet flight: స్పైస్‌జెట్ విమానంలో మ‌రోసారి సాంకేతికలోపం..24 రోజుల్లో తొమ్మిది సార్లు అంతరాయం..

|

Jul 13, 2022 | 9:40 AM

మరోసారి స్పైస్‌జెట్‌ విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. 24 రోజుల్లో స్పైస్‌జెట్ విమానంలో సాంకేతిక లోపం ఘటనలు చోటుచేసుకోవడం ఇది తొమ్మిదవది.

SpiceJet flight: స్పైస్‌జెట్ విమానంలో మ‌రోసారి సాంకేతికలోపం..24 రోజుల్లో తొమ్మిది సార్లు అంతరాయం..
Spicejet
Follow us on

స్పైస్‌జెట్‌ విమానంలో వరుసగా సమస్యలు తలెత్తుతోనే ఉన్నాయి. ఇది ప్రయాణికులను ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా మరోసారి స్పైస్‌జెట్‌ విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో దుబాయ్ నుంచి మధురై వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానం ఆలస్యంగా బయలుదేరింది. 24 రోజుల్లో స్పైస్‌జెట్ విమానంలో సాంకేతిక లోపం ఘటనలు చోటుచేసుకోవడం ఇది తొమ్మిదవది. దుబాయి నుంచి మదురై వెళ్లే విమానం ఆలస్యంగా బయలుదేరింది. VT-SZK రిజిస్ట్రేషన్ నంబర్ కలిగిన బోయింగ్ B737 మ్యాక్స్ విమానం మంగళూరు నుంచి దుబాయికి ప్రయాణించింది. ఆ విమానం ల్యాండ్‌ కాగానే ఇంజినీర్‌ తనిఖీ చేయగా.. నోస్‌ వీల్‌లో లోపం ఉన్నట్టుగా గుర్తించారు. దీంతో స్పైస్‌జెట్‌ తిరిగి దుబాయి-మదురై వెళ్లే ప్రయాణికుల కోసం మరో విమానాన్ని ముంబయి నుంచి దుబాయికి పంపింది.

అయితే, సాంకేతిక సమస్య వల్లే అలస్యం అయినట్లుగా స్పైస్‌జెట్ వివరణ ఇచ్చింది. స్పైస్‌జెట్‌ సాంకేతిక లోపాలు తలెత్తడం గత 24 రోజుల్లో ఇది తొమ్మిదో సారి కాగా, ఇందులో మూడు ఘటనలు ఈ నెల(జులై) 5నే చోటుచేసుకున్నాయి. ఇక, స్పైస్‌జెట్ విమానాల్లో వరుసగా సాంకేతిక లోపాలకు సంబంధించిన సంఘటనల నేపథ్యంలో డీజీసీఏ ఇటీవల షోకాజ్ నోటీసు జారీ చేసింది. సుర‌క్షిత‌మైన‌, స‌మ‌ర్థ‌వంత‌మైన‌, న‌మ్మ‌క‌మైన సేవ‌ల్ని క‌ల్పించ‌డంలో స్పైస్‌జెట్ సంస్థ విఫ‌ల‌మైన‌ట్లు పేర్కొంది. ఇటీవల చోటుచేసుకుంటున్న సాంకేతిక లోపాలపై వివరణ కోరింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి