G20 Summit: ఆ కారణంతో జీ-20 సమావేశాలకు రాలేకపోతున్న మరో దేశాధినేత..

జీ20 సమావేశాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సెప్టెంబర్ 9,10 వ తేదీల్లో ఢిల్లీలోని ఈ జీ20 సదస్సు జరగనుంది. అయితే కరోనా కారణంగా మరో నేత జీ 20 సమావేశాలకు హాజరుకావడం లేదు. ఎందుకంటే స్పెయిన్ ప్రెసిడెంట్ పెడ్రో శాంచెజ్‌కు కోవిడ్ పాజిటీవ్‌గా తేలింది. దీంతో ఆయన జీ20 సదస్సుకు హాజరు కావడం లేదని ప్రకటించారు. ఈ విషయాన్ని ట్విట్టర్‌లో అధికారికంగా తెలిపారు. దీనివల్ల మరో కీలక ఈ జీ20 సమావేశాలకు దూరమయ్యారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలో జరగనున్న జీ20 సమావేశాలకు స్పెయిన్ దేశాధినేత రావడం లేదు.

G20 Summit: ఆ కారణంతో జీ-20 సమావేశాలకు రాలేకపోతున్న మరో దేశాధినేత..
G 20 Summit

Updated on: Sep 08, 2023 | 9:18 AM

జీ20 సమావేశాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సెప్టెంబర్ 9,10 వ తేదీల్లో ఢిల్లీలోని ఈ జీ20 సదస్సు జరగనుంది. అయితే కరోనా కారణంగా మరో నేత జీ 20 సమావేశాలకు హాజరుకావడం లేదు. ఎందుకంటే స్పెయిన్ ప్రెసిడెంట్ పెడ్రో శాంచెజ్‌కు కోవిడ్ పాజిటీవ్‌గా తేలింది. దీంతో ఆయన జీ20 సదస్సుకు హాజరు కావడం లేదని ప్రకటించారు. ఈ విషయాన్ని ట్విట్టర్‌లో అధికారికంగా తెలిపారు. దీనివల్ల మరో కీలక ఈ జీ20 సమావేశాలకు దూరమయ్యారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలో జరగనున్న జీ20 సమావేశాలకు స్పెయిన్ దేశాధినేత రావడం లేదు. ఈ సమావేశాలకు వచ్చే ముందు గురువారం రోజున ఆయన కోవిడ్ టెస్ట్ చేయించుకున్నారు. కానీ ఆయనకు కోవిడ్ పాజిటీవ్ వచ్చింది. దీనివల్ల ఆయన ఇండియాకు రాలేకపోతున్నారు. అయితే ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగానే ఉందని.. పెడ్రో శాంచెజ్‌ తెలిపారు.

ఇక ఈ జీ 20 సమావేశాల్లో స్పెయిన్ తరఫున వైస్ ప్రెసిడెంట్ నాడియా క్వాలినో శాంటామారియా.. అలాగే విదేశాంగ మంత్రి జోస్ మాన్యుయెల్ అల్బరేస్ ప్రాతనిధ్యం వహిస్తారని పేర్కొన్నారు. అలాగే యూరోపియన్ సహకారం ఉంటుందని చెప్పారు. మరో వైపు ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్నటువంటి ఈ సమావేశాలకు ప్రపంచ దేశాల నుంచి నేతలు రానున్నారు. ఈ సమావేశాలకు ఇప్పటికే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అలాగే చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఇప్పటికే ఈ జీ 20 సమావేశాలకు హాజరుకావడం లేదని చెప్పారు. అయితే ఇప్పుడు తాజాగా స్పెయిన్ అధ్యక్షుడు పెడ్రో శాంచెజ్ ఈ సమావేశాలకు రావడం లేదు. దీనివల్ల ముఖ్యమైనటువంటి మూడు దేశాల నుంచి ఆయా అధ్యక్షులు సమావేశాల్లో పాల్గొనడం లేదు. ఇదిలా ఉండగా.. ప్రపంచంలోని పలు ప్రధాన దేశాధినేతలు శుక్రవారం రోజున ఢిల్లీలో కాలుమోపనున్నారు.

ఇవి కూడా చదవండి

జీ20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొని తమ వాణిని వినిపించనున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ సహా పలువులు దేశాధినేతలు.. శుక్రవారం ఢిల్లీకి చేరుకోనున్నారు. అయితే జీ20 సదస్సు కోసం అందరికంటే ముందుగా ఇండియాకు చేరుకుంటున్నారు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్. భారతీయ ములాలున్నటువంటి బ్రిటన్ ప్రధాని శుక్రవారం మధ్యాహ్నం 1.40 PM నిమిషాలకు ఢిల్లీకి చేరుకోనున్నారు. కేంద్ర సహాయ మంత్రి అశ్వినీ కుమార్ చౌదరరి సునాక్‌కు స్వాగతం పలకనున్నారు. ఈ ఏడాది భారత్ జీ20 సదసస్సుకు సారథ్య బాధ్యతలు వహిస్తోన్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ సదస్సు కోసం ప్రధాని మోదీ చేస్తున్న కృషి అమెఘమని రిష్ సునాక్ అన్నారు. అలాగే ఆయన నాయకత్వంలో ప్రపంచంలో భారత్ సాధిస్తున్న విజయాలు అద్వితీయం అంటూ కొనియాడారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..