Special Train: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. సికింద్రాబాద్‌ నుంచి ఆ రైలు తిరిగి ప్రారంభం

|

Mar 12, 2021 | 2:12 PM

Special Train: కరోనా కారణంగా లాక్‌డౌన్‌ విధించడంతో రైల్వే శాఖ చాలా వరకు రైళ్లను నిలిపివేసింది. అన్‌లాక్‌ ప్రక్రియలో భాగంగా ఇప్పటి దాదాపు అన్ని రైళ్లు పట్టాలెక్కాయి..

Special Train: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. సికింద్రాబాద్‌ నుంచి ఆ రైలు తిరిగి ప్రారంభం
South Central Railway Restored Secunderabad Trivandrum Special Train
Follow us on

Special Train: కరోనా కారణంగా లాక్‌డౌన్‌ విధించడంతో రైల్వే శాఖ చాలా వరకు రైళ్లను నిలిపివేసింది. అన్‌లాక్‌ ప్రక్రియలో భాగంగా ఇప్పటి దాదాపు అన్ని రైళ్లు పట్టాలెక్కాయి. కొన్ని రైళ్లను మాత్రం ఇంకా ప్రారంభించలేదు. తాజాగా సికింద్రాబాద్‌ నుంచి త్రివేండ్రం వెళ్లే రైలు తిరిగి ప్రారంభిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. గతంలో ఈ రైలు పలు కారణాల వల్ల నిలిపివేసింది. అయితే 2021 మార్చి 20న ఈ రైలు మళ్లీ పట్టాలెక్కి ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. కరోనా మహమ్మారి కారణంగా లాక్‌డౌన్‌ తర్వాత రైల్వే ప్రకటించిన ప్రత్యేక రైళ్లలో ఈ రైలు ఒకటి. ఈ రైలు సికింద్రాబాద్‌ నుంచి త్రివేండ్రం వెళ్తుంది. శబరిమల వెళ్లే భక్తుల కోసం ఈ రైలును నడపనుంది.

మార్చి 20 నుంచి ఈ రైలు అదే రూట్‌లో మళ్లీ సేవలు అందించనుంది. ఈ స్పెషల్‌ ట్రైన్‌లో ఏసీ 2 టైర్‌, ఏసీ 3 టైర్‌, జనరల్‌ సీటింగ్‌ క్లాస్‌ కోచ్‌లు ఉన్నాయి. రైలు నెంబర్‌ 07230 మధ్యాహ్నం 12.20 గంటలకు సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరుతుంది. ఈ రైలు మరుసటి రోజు సాయంత్రం 6.30 గంటలకు త్రివేండ్రం చేరుకుంటుంది. దక్షిణ మధ్య రైల్వే ఈ ప్రత్యేక రైలును పునరుద్దరించగానే ఐఆర్‌సీటీసీలో టికెట్ల బుకింగ్‌ ప్రారంభమైంది. ఐఆర్‌సిటీసీ అధికారి వెబ్‌సైట్‌లో https://www.irctc.co.in/ టికెట్లు బుక్ చేసుకోవచ్చు. కాగా, లాక్‌డౌన్‌ కారణంగా నిలిచిపోయిన రైళ్లన్ని ఒక్కొక్కటిగా అందుబాటులోకి తీసుకువస్తోంది. రైల్వే శాఖ. ప్రస్తుతం నడుస్తున్న రైళ్లలో ఎప్పటికప్పుడు శానిటైజ్‌ చేస్తున్నారు. ఆయా రైల్వే స్టేషన్‌లలో కరోనా నిబంధనలు పాటిస్తూ చర్యలు చేపడుతున్నారు రైల్వే అధికారులు. రైళ్లల్లో ప్రయాణించే ప్రయాణికులకు ప్రతి ఒక్కరికి మాస్క్‌ ఉండేలా చర్యలు చేపడుతున్నారు. మాస్క్‌ లేనిది స్టేషన్‌లోకి అనుమతించడం లేదు.

ఇవీ కూడా చదవండి :

4G Network: మీ మొబైల్‌లో 4జీ నెట్‌ వర్క్‌ సరిగ్గా రావడం లేదా..? స్పీడు తగ్గిందా..? ఇలా చేస్తే స్పీడ్‌ పెంచుకోవచ్చు

విదేశాల పర్యటనకు వెళ్లేందుకు ప్లాన్‌ చేస్తున్నారా..? ఈ నిబంధనలు తప్పకుండా తెలసుకోండి.. లేకపోతే ఇబ్బందే..!

ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పొందిన కుమారుడే తల్లిదండ్రులపైన కేసు పెట్టాడు.. కారణం ఏమిటో తెలిస్తే..