Special Trains: దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన.. పలు రైళ్లు పొడిగింపు.. మరికొన్ని సర్వీసులు రద్దు..!

|

Apr 30, 2021 | 6:04 PM

Special Trains: ఈ మధ్య కాలంలో రైల్వే ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని కొన్ని రైళ్లను పొడిగిస్తూ, మరికొన్ని రైళ్లను రద్దు చేస్తోంది రైల్వే శాఖ. కరోనాతో దేశంలో మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తారన్న..

Special Trains: దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన.. పలు రైళ్లు పొడిగింపు.. మరికొన్ని సర్వీసులు రద్దు..!
indian railways
Follow us on

Special Trains: ఈ మధ్య కాలంలో రైల్వే ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని కొన్ని రైళ్లను పొడిగిస్తూ, మరికొన్ని రైళ్లను రద్దు చేస్తోంది రైల్వే శాఖ. కరోనాతో దేశంలో మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తారన్న పుకార్లతో వలస కార్మికులు తమ తమ స్వస్థలాలకు వెళ్లేందుకు రైల్వే స్టేషన్‌లకు చేరుకుంటుండటంతో ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని మరికొన్ని రైళ్లను నడుపుతున్న రైల్వే శాఖ.. మరికొన్ని ప్రాంతాల్లో కరోనాతో ప్రయాణికుల సంఖ్య భారీగా తగ్గిపోవడంతో కొన్ని రైలు సర్వీసులను రద్దు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా దక్షిణ మధ్య రైల్వే శాఖ కీలక ప్రకటన చేసింది. పలు ప్రత్యేక రైళ్లను పొడిగించడంతో పాటు మరి కొన్ని రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు తెలిపింది. అయితే ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది.

వివిధ కారణాలతో కొన్ని రైళ్లను రద్దు చేసింది. హైదరాబాద్‌-హౌరా ప్రత్యేక రైళ్లను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు రైల్వే అధికారులు. హైదరాబాద్‌ నుంచి హౌరా వెళ్లే రోజువారీ ప్రత్యేక రైలు (08646) మే 1 నుంచి 15వ తేదీ వరకు పొడించినట్లు వెల్లడించారు. అలాగే హౌరా నుంచి హైదరాబాద్‌కు నడిచే ప్రత్యేక రైలు (08645) మే 3 నుంచి 17వ తేదీ వరకు పొడిగించారు.

ఇదిలా ఉండగా, సికింద్రాబాద్‌ నుంచి ముంబై (097058-07057 నెంబర్‌) రైళ్లు, ముంబై- హైదరాబాద్‌ మధ్య నడిచే (01141,01142) ప్రత్యేక రైళ్లను మే 1,2 తేదీల్లో రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.

ఇవీ చదవండి:

Trees: రెండు చెట్లు నరికినందుకు రూ.1.21 కోట్ల జరిమానా .. ఈ చెట్లకు ఉన్న ప్రాధాన్యత ఏంటో తెలిస్తే ఆశ్యర్యపోతారు

Corona Vaccine: రాష్ట్రాలను హెచ్చరించిన సుప్రీం కోర్టు.. వ్యాక్సిన్‌ ధరల విషయంలో కేంద్రంపై కీలక వ్యాఖ్యలు

Covid-19 Effect: కరోనా విలయతాండవం.. పోలీసులను బలి తీసుకుంటున్న కరోనా మహమ్మారి.. కోవిడ్‌తో 42 మంది పోలీసులు మృతి