Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్.. 79 రైళ్లు రద్దు.. పూర్తి వివరాలివే..

|

Jul 24, 2021 | 9:57 AM

Trains Cancelled: మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేళర రాష్ట్రాల్లో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్.. 79 రైళ్లు రద్దు.. పూర్తి వివరాలివే..
Trains
Follow us on

Trains Cancelled: మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేళర రాష్ట్రాల్లో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జన జీవనం స్థంభించిపోయింది. రోడ్లన్నీ జలమయం అవడంతో రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. మరోవైపు రైళ్ల రాకపోకలకూ తీవ్ర అంతరాయం కలుగుతోంది. భారీ వర్షాలతో పట్టాలపై నీళ్లు నిలిచిపోవడం, ఆయా స్టేషన్లలో ప్లాట్‌ఫామ్‌లు జలమయం అవడం, పర్వత ప్రాంతాల్లో కొండ చరియలు విరిగి పడ్డాయి. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే, సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం తీసుకకున్నారు. సౌత్ సెంట్రల్, సెంట్రల్ రైల్వే, సౌత్ వెస్ట్ రైల్వే పరిధిలో నడిచే పలు రైళ్లను రద్దు చేశారు. మరికొన్ని రైళ్ల రూట్ మార్చారు. ఇంకొన్ని రైళ్లను తాత్కాలికంగా నిలిపివేశారు.

ఈ మేరకు సౌత్ సెంట్రల్ రైల్వే, సెంట్రల్ రైల్వే, సౌత్ వెస్ట్ రైల్వే ఒక ప్రకటన విడుదల చేశాయి. ఈ మేరకు ట్వీట్ చేశాయి. రద్దైన, దారి మళ్లించిన, తాత్కాలికంగా రద్దు చేసిన రైళ్ల వివరాలను వెల్లడించాయి. సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో మొత్తం 14 రైళ్లను రద్దు చేయగా.. సౌత్ వెస్ట్ రైల్వే 15 రైలు సర్వీసులను రద్దు చేసింది. మూడు సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు. మరో 16 రైళ్లను దారి మళ్లించారు. సెంట్రల్ రైల్వే 50 రైళ్లను రద్దు చేసింది.

పూర్తిగా రద్దైన, తాత్కాలిక రద్దైన, దారి మళ్లించిన రైళ్ల వివరాలు ఈ ట్వీట్‌లో చూడొచ్చు..

Also read:

యజమాని కోసం పిల్లి చేసిన సాహసం..పాముతో ఫైట్ చేసి మరి యజమానికి ముప్పు తప్పించింది..వీడియో:Cat Fight With Snake Video.

Guru Purnami : తెలుగురాష్ట్రాల్లో భక్తిప్రపత్తులతో గురుపౌర్ణమి వేడుకలు.. ఆలయాల్లో భక్తుల రద్దీ

ఐదు కొమ్ములతో అరుదైన గొర్రె..!ఎందుకిలా..?యుగాంతానికి సంకేతమా..?:sheep has 5 horns Video.