All Time Grain: గుడ్ న్యూస్.. త్వరలో ఏటీఎం తరహా మిషన్లతో రేషన్ సరకుల పంపిణీ.. ఆ రాష్ట్రంలో తొలిసారిగా..

|

Jul 20, 2022 | 4:53 PM

ATGలు.. ATM మెషీన్‌ల మాదిరిగానే ఉంటాయని.. కానీ ఆహారధాన్యాలను పంపిణీ చేస్తాయని మంత్రి అతాను నాయక్ తెలిపారు. ప్రాథమిక దశలో రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు.

All Time Grain: గుడ్ న్యూస్.. త్వరలో ఏటీఎం తరహా మిషన్లతో రేషన్ సరకుల పంపిణీ.. ఆ రాష్ట్రంలో తొలిసారిగా..
Atg Machine
Follow us on

ATG machines: ఆధునిక సాంకేతిక యుగం సరికొత్త ఆవిష్కరణలు వెలుగుచూస్తున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే.. పలు రకాల యంత్రాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. త్వరలో మరో సరికొత్త ఆవిష్కరణ ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఒడిశా రాష్ట్రంలో త్వరలో ఆహార ధాన్యాల కోసం పంపిణీ కోసం ATM లాంటి యంత్రాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆల్ టైమ్ గ్రెయిన్ ( ATG ) డిస్పెన్సింగ్ మెషీన్లను రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల్లో ఏర్పాటు చేయనున్నట్లు ఆహార సరఫరాలు, వినియోగదారుల సంక్షేమ శాఖ మంత్రి అటాను ఎస్ నాయక్ బుధవారం వెల్లడించారు. పథకం కింద లబ్ధిదారులకు ఆహారధాన్యాలను అందించడానికి ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా ATGలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ATGలు.. ATM మెషీన్‌ల మాదిరిగానే ఉంటాయని.. కానీ ఆహారధాన్యాలను పంపిణీ చేస్తాయని మంత్రి అతాను నాయక్ తెలిపారు. ప్రాథమిక దశలో రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. ఏటీజీ సేవలు మొదట్లో భువనేశ్వర్‌లో అందుబాటులో ఉంటాయని మంత్రి తెలిపారు.

జాతీయ ఆహార భద్రతా చట్టం, రాష్ట్ర ఆహార భద్రత పథకం లబ్ధిదారులకు ఈ సేవను పొందేందుకు ప్రత్యేక కార్డు అందించనున్నట్లు మంత్రి అతాను నాయక్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ఒక ప్రణాళికను రూపొందిస్తోందని, భువనేశ్వర్ నగరంలోని వివిధ ప్రదేశాలలో ‘ATG’ కియోస్క్‌లను ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. వ్యవసాయ అభివృద్ధిలో భాగంగా ఒడిశా ప్రభుత్వం చిన్న, సన్నకారు రైతులకు ఎటువంటి వడ్డీ లేకుండా రూ.1 లక్ష వరకు వ్యవసాయ రుణాన్ని అందించాలని నిర్ణయించినట్లు తెలిపారు. గతంలో రైతులకు రూ.50 వేల వరకు వడ్డీలేని రుణాలు అందుతున్నాయని మంత్రి తెలిపారు.

ఇది కాకుండా రూ.లక్ష నుంచి రూ.3 లక్షల మధ్య వ్యవసాయ రుణంపై కేవలం 2 శాతం వడ్డీ మాత్రమే వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. దీని వల్ల 32 లక్షల మంది చిన్న, సన్నకారు రైతులు ప్రయోజనం పొందుతారని చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..