sonu sood: సుప్రీంకోర్టును ఆశ్రయించిన సోనూసూద్… భవనాన్ని కూల్చకుండా అడ్డుకోవాలని పిటిషన్…

| Edited By:

Jan 31, 2021 | 8:28 PM

కరోనా కాలంలో లక్షలాది మందిని ఆదుకున్న బాలీవుడ్ నటుడు సోనూసూద్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు...

sonu sood: సుప్రీంకోర్టును ఆశ్రయించిన సోనూసూద్... భవనాన్ని కూల్చకుండా అడ్డుకోవాలని పిటిషన్...
Follow us on

కరోనా కాలంలో లక్షలాది మందిని ఆదుకున్న బాలీవుడ్ నటుడు సోనూసూద్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బీఎంసీ నోటీసు నేపథ్యంలో భవన నిర్మాణ పనులను ఆపివేశామని, అయితే ఇప్పటికే పనులు పూర్తయిన భవనాన్ని కూల్చకుండా అడ్డుకోవాలని పిటిషన్ వేశారు. కాగా…ముంబైలోని జూహు ప్రాంతంలోని సోనూ నివాసంలో అక్రమ నిర్మాణాలపై బృహన్‌ ముంబై కార్పొరేషన్‌ (బీఎంసీ) నోటీసులు ఇచ్చింది. ఆరు అంతస్తుల ‘శక్తి సాగర్‌’ భవనాన్ని హోటల్‌గా మార్చడంపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. దీంతో బీఎంసీ ఎలాంటి చర్యలు చేపట్టకుండా తొలుత స్థానిక కోర్టును ఆశ్రయించగా ఆయన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. జనవరి నెల మొదట్లో బాంబే హైకోర్టులో పిటిషన్‌ వేయగా అక్కడ కూడా చుక్కెదురైంది. దీంతో సోనూసూద్ నివాసంలో అక్రమ నిర్మాణాలపై కేసు నమోదు చేయాలంటూ జూహు పోలీస్‌ స్టేషన్‌ను బీఎంసీ కోరింది. దీంతో సోనూసూద్ తాజాగా సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు.

నిబంధనలకు లోబడే…

తన నివాసంలో వాణిజ్య నిర్మాణాల కోసం చేసిన దరఖాస్తును మహారాష్ట్ర కోస్టల్ జోన్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఎంసీజెడ్‌ఎంఏ) నిబంధనలకు లోబడి మున్సిపల్ కమిషనర్ 2018లో ఆమోదించారని పేర్కొన్నారు. మహారాష్ట్ర ప్రాంతీయ, పట్టణ ప్రణాళిక చట్టం 1966లోని సెక్షన్ 43 (1) నిబంధనలను పరిగణనలోకి తీసుకోకుండా బాంబే హైకోర్టు ఈ నెల 13న తన పిటిషన్‌ను తిరస్కరించిందని తెలిపారు.పైన పేర్కొన్న సెక్షన్‌లోని నిబంధన ప్రకారం అంతర్గత పునరుద్ధరణ పనులకు ఎలాంటి అనుమతి అవసరం లేదని సోను సూద్‌, ఆయన భార్య ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. బీఎంసీ నోటీసు నేపథ్యంలో ఆ పనులను ఆపివేశామని, అయితే ఇప్పటికే పనులు పూర్తయిన భవనాన్ని కూల్చకుండా అడ్డుకోవాలని అందులో కోరారు.