Sonu Sood: కరోనాతో బాధపడుతున్న యువతిని నాగ్‌పూర్‌ నుంచి హైదరాబాద్‌కు విమానంలో తరలించిన ‘రియల్ హీరో సోనూసూద్‌’

|

Apr 23, 2021 | 6:23 PM

Sonu Sood: సోనూసూద్‌.. ఈ పేరు మర్చిపోనివారుండరు. ఎందుకంటే ఎవరికైనా అపద వచ్చిందంటే సాయం చేయడంలో ముందుంటాడు. గత ఏడాది కరోనా కాలంలో లాక్‌డౌన్‌లో ఎన్నో..

Sonu Sood: కరోనాతో బాధపడుతున్న యువతిని నాగ్‌పూర్‌ నుంచి హైదరాబాద్‌కు విమానంలో తరలించిన రియల్ హీరో సోనూసూద్‌
Sonu Sood
Follow us on

Sonu Sood: సోనూసూద్‌.. ఈ పేరు మర్చిపోనివారుండరు. ఎందుకంటే ఎవరికైనా అపద వచ్చిందంటే సాయం చేయడంలో ముందుంటాడు. గత ఏడాది కరోనా కాలంలో లాక్‌డౌన్‌లో ఎన్నో సహకారాలు, నిరుపేదలకు ఆదుకోవడంతో దేవుడైపోయాడు. తాజాగా దేశంలో కరోనా విజృంభిస్తుండటంతో కష్టాల్లో ఉన్నవారిని ఆదుకుంటూ మానవత్వం చాటుకుంటున్నారు సోనూసూద్‌. అవిశ్రాంతగా నిస్వార్థ్యంగా పేదవారి కోసం పని చేస్తున్నారు. తాజాగా సోనూ సూద్, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న కోవిడ్ -19 రోగిని ప్రత్యేక చికిత్స కోసం నాగ్‌పూర్ నుండి హైదరాబాద్‌కు ఎయిర్ అంబులెన్స్‌ విమానంలో పంపించారు. కరోనా కారణంగా భారతి అనే అమ్మాయి దాదాపు 85-90శాతం ఊపిరితిత్తులను కోల్పోయింది. సోనూ ఆమెను నాగ్‌పూర్‌లోని వోక్‌హార్ట్‌ ఆస్పత్రికి తరలించారు. ఆమె ఊపిరితిత్తుల మార్పిడి లేదా ప్రత్యేక చికిత్స అవసరమని వైద్యులు తెలిపారు. ఇది హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో మాత్రమే సాధ్యమని వైద్యులు తెలుపడంతో వెంటనే సోనూ అపోలో ఆస్పత్రి వైద్యులతో సంప్రదింపులు జరిపారు.

ఈసీఎంవో అని పిలిచే ఒక ప్రత్యేక చికిత్స ఉందని అతను తెలుసుకున్నారు. దీంతో శరీరానికి కృత్రిమంగా రక్తం పంపింగ్‌ చేయడం వల్ల ఊపిరితిత్తులపై ఒత్తిడిని తగ్గించవచ్చు. ఈ ఈసీఎంవో చికిత్స కోసం మొత్తం సెటప్‌ హైదరాబాద్‌ నుంచి ఆరుగురు వైద్యులతోఒక రోజు ముందుగానే రావాలి. ఇందుకోసం ఎయిర్‌ అంబులెన్స్‌ ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో భారతి ఈ చికిత్స పొందగలిగింది. దీనిపై సోనూసూద్‌ మాట్లాడుతూ.. అవకాశాలు 20 శాతం మాత్రమే అని వైద్యులు తెలిపారు. ఆమె 25 ఏళ్ల వయసు ఉన్న యువతి. అందుకే వెంటనే ఎయిర్ అబులెన్సు ఏర్పాటు చేశాము. హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స బాగా జరుగుతోంది. ఆమె కోలుకొని త్వరలో తిరిగి వస్తుంది అని అన్నారు.

కాగా, ఇలాంటి కరోనా పరిస్థితుల్లో ఒకరిని విమానంలో చికిత్సకు తీసుకురావడం ఇదే మొదటిసారి. భారతి తండ్రి రిటైర్డ్‌ రైల్వే అధికారి. కాగా, సోనూసూద్‌కు ఇటీవల కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కాగా, ఆయన హోమ్‌ క్వారంటైన్‌లో ఉంటూ అన్ని చేయడం అభినందనీయం. అందుకే ఆయన ‘రియల్ హీరో’ పేరు తెచ్చుకుంటున్నారు.

Telangana Corona: నైట్‌ కర్ఫ్యూ విధించడం కాదు.. ప్రజలను బయట తిరగనీయకూడదు: తెలంగాణ హైకోర్టు

Proning: ప్రోనింగ్‌ విధానం ద్వారా ఆక్సిజన్‌ స్థాయిలను మెరుగు పర్చుకోవడం ఎలా..? కేంద్ర ఆరోగ్యశాఖ సూచనలు