Sonia Gandhi- Rahul Gandhi: సోనియా, రాహుల్‌ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం.. భోపాల్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌

కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్‌ గాంధీ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ప్రతికూల వాతావరణం కారణంగా భోపాల్ విమానాశ్రయంలో అత్యవసరంగా విమానాన్ని ల్యాండ్ చేశారు.

Sonia Gandhi- Rahul Gandhi: సోనియా, రాహుల్‌ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం.. భోపాల్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
Sonia Gandhi, Rahul Gandhi

Updated on: Jul 18, 2023 | 9:49 PM

కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్‌ గాంధీ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ప్రతికూల వాతావరణం కారణంగా భోపాల్ విమానాశ్రయంలో అత్యవసరంగా విమానాన్ని ల్యాండ్ చేశారు. బెంగళూరులో ప్రతిపక్ష పార్టీల సమావేశంలో పాల్గొన్న అనంతరం సోనియా, రాహుల్‌ విమానంలో ఢిల్లీకి పయనమయ్యారు. అయితే సాంకేతిక లోపం తలెత్తడంతో రాత్రి 8 గంటల సమయంలో భోపాల్‌లోలోని రాజా భోజ్ విమానాశ్రయంలో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు.  అయితే ప్రతికూల వాతావరణం కూడా ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు కారణమని తెలుస్తోంది. కాగా భోపాల్‌ నుంచి ఇండిగో విమానంలో సోనియా, రాహుల్ ఢిల్లీకి బయలుదేరనున్నారు.  కాగా బెంగళూరులో జరిగిన విపక్షాల సమావేశంలో రాహుల్, సోనియాలతో పాటు 26 పార్టీలు పాల్గొన్నాయి. ఈ మేరకు ఎన్టీయేను ఎదుర్కోవడానికి తమ కూటమికి INDIA అని పేరు పెట్టాయి.

 

ఇవి కూడా చదవండి

కాగా కూటమికి ఒక సమన్వయకర్త ఉంటారని, 11 మంది సభ్యులతో కూడిన సమన్వయ కమిటీ కూడా ఉండాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌కు అధికారంపైనా, ప్రధాని పదవిపైనా ఆసక్తి లేదని తాను ఖచ్చితంగా చెప్పానని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే అన్నారు. కూటమికి సంబంధించి కన్వీనర్, సమన్వయ కమిటీ సభ్యులను ముంబైలో జరిగే తదుపరి సమావేశంలో నిర్ణయిస్తామని ఖర్గే చెప్పారు. విపక్షాల సమావేశం అనంతరం ఖర్గే మాట్లాడుతూ.. మా కూటమి పేరు ఇండియా అని అన్నారు. ఈ ప్రతిపాదనకు అందరూ ఒకే గొంతుకలో మద్దతు పలికారని అయన పేర్కొన్నారు.