President Remark Row: ‘డోంట్ టాక్ టు మీ..’ స్మృతి ఇరానీ పై సోనియా గాంధీ ఫైర్.. పార్లమెంట్‌లో సీన్ రివర్స్..
You don't talk to Me: రెండ్రోజులుగా విపక్ష సభ్యులు చేస్తున్న రచ్చకు ఒక్కసారిగా బ్రేక్ పడింది.. ఇప్పుడు బీజేపీ ఎంపీలు మంటల యుద్ధం మొదలు పెట్టారు. కాంగ్రెస్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి..
ధరల పెరుగుదలపై పార్లమెంట్‌లో రగడ జరుగుతుండగా సీన్ ఒక్కసారిగా రివర్స్ గేర్‌లోకి వెళ్లిపోయింది. రెండ్రోజులుగా విపక్ష సభ్యులు చేస్తున్న రచ్చకు ఒక్కసారిగా బ్రేక్ పడింది.. ఇప్పుడు బీజేపీ ఎంపీలు మంటల యుద్ధం మొదలు పెట్టారు. కాంగ్రెస్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి అధ్యక్షురాలు ద్రౌపది ముర్మును ‘రాష్ట్రపత్నీ’ అని పిలిచినందుకు గురువారం పార్లమెంటులో పెద్ద దుమారమే రేగింది. రాష్ట్రపతిని ఉద్దేశించి కాంగ్రెస్ నేత ఈ పదాన్ని ఉపయోగించడంపై బీజేపీ నిరసన వ్యక్తం చేసింది. పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అధీర్ వ్యాఖ్యల్ని తీవ్రంగా పరిగణించిన బీజేపీ.. నేరుగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపైనే టార్గెట్ చేసింది. రాష్ట్రపతితోపాటు దేశానికి సోనియా గాంధీ క్షమాపణ చెప్పాల్సిందేనని బీజేపీ ఎంపీలు పట్టుబడుతోంది.
అధీర్ రంజన్ చౌదరి పార్లమెంట్‌లో చేసిన కామెంట్స్‌తో బీజేపీ నేతలు నిరసనలకు దిగారు. సభలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు సోనియా గాంధీ ప్రయత్నించారు. లోక్‌సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడగానే సోనియా గాంధీ.. ట్రెజరీ బెంచ్ వద్దకు చేరుకున్నారు. ఈ వివాదంలోకి తనను ఎందుకు లాగుతున్నారని అక్కడ ఉన్న బీజేపీ నేత రమాదేవిని అడిగారు. పక్కనే ఉన్న స్మృతి ఇరానీ కలగజేసుకున్నారు. సోనియా గాంధీని చూపిస్తూ అధీర్ కామెంట్స్‌పై నిరసన వ్యక్తం చేశారు. అయితే స్మృతి ఇరానీ కల్పించుకుని చెబుతున్నప్పుడు.. సోనియా ఆమెను పట్టించుకోలేదు. సోనియా వైపు సైగ చేస్తూ చౌదరి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. అయితే, కాసేపటికే స్మృతి ఇరానీ వైపు చూసి కోపంగా మాట్లాడారు.
ఈ విషయంపై రమాదేవి స్పందించారు. “నా పేరును ఎందుకు ప్రస్తావిస్తున్నారు? నా తప్పు ఏంటి? అని సోనియా నన్ను అడిగారు. కాంగ్రెస్ లోక్సభాపక్షనేతగా చౌదరిని ఎంపిక చేయడమే మీరు చేసిన తప్పు” అని నేను సోనియా గాంధీతో చెప్పినట్లుగా మీడియాకు వివరించారు రమాదేవి.
అయితే, సోనియా గాంధీ లోక్‌సభలో కొందరు బీజేపీ ఎంపీలను బెదిరించారని సంచలన ఆరోపించారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మండిపడ్డారు. “లోక్‌సభలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి సోనియా గాంధీ.. మా పార్టీ ఎంపీ రమా దేవి వద్దకు వచ్చారు. అప్పుడు మా పార్టీకే చెందిన మరికొందరు అక్కడకు వెళ్లగానే.. ‘నువ్వు(Smriti Irani)నాతో మాట్లాడకు’ అంటూ సోనియా గాంధీ లోక్‌సభలో మా సభ్యులను(స్మృతి ఇరానీ) బెదిరించే ధోరణిలో అరిచారు. రాష్ట్రపతిపై చేసిన కామెంట్స్ సంబంధించి అధీర్ రంజన్.. సారీ చెప్పాల్సిన అవసరం లేదని వాదించారని వెల్లడించారు నిర్మలా సీతారామన్.
Congress interim president Sonia Gandhi said that he has already apologised, she is misleading the country. AR Chowdhury has been claiming that there is no need to apologise: Union Finance Minister Nirmala Sitharaman on Cong MP Adhir Chowdhury’s ‘Rashtrapatni’ remarks pic.twitter.com/FeksWQT4rf
— ANI (@ANI) July 28, 2022
ఈ అంశాన్ని బీజేపీ పార్లమెంట్‌లో లేవనెత్తింది..
అధ్యక్షురాలు ద్రౌపది ముర్ముపై కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి చేసిన అనుచిత వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీలు ఈరోజు కాంగ్రెస్ ఉభయ సభల్లో రచ్చ సృష్టించారు. బీజేపీ తరపున స్మృతి ఇరానీ లోక్‌సభలో, నిర్మలా సీతారామన్ రాజ్యసభలో ఈ అంశాన్ని లేవనెత్తారు. రాష్ట్రపతిని ఉద్దేశించి కాంగ్రెస్ నేత వాడిన మాటలను బీజేపీ తప్పుపట్టింది. దేశంలో అత్యున్నత పదవిలో ఉన్న గిరిజన మహిళను అవమానించినందుకు కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం..