సోనియా గాంధీ నాయకత్వం.. ఓ సస్పెన్స్.. తాత్కాలికమా ?శాశ్వతమా ?

| Edited By: Anil kumar poka

Feb 13, 2020 | 9:48 AM

130 ఏళ్లకు పైగా చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సమస్య సస్పెన్స్ లో పడింది. తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇలాగే తాత్కాలిక పదవిలో కొనసాగుతారా లేక శాశ్వతంగా పదవిలో ఉంటారా .. అదీ కాకపోతే.. పార్టీకి కొత్త అధ్యక్షుడిని నియమిస్తారా అన్నది తేలాల్సి ఉంది. ఏప్రిల్ రెండో వారంలో నిర్వహించనున్న ప్లీనరీ సమావేశాల్లో దీనిపై ఒక నిర్ణయం తీసుకోవచ్చునని తెలుస్తోంది. సోనియా ఆరోగ్యం తరచూ ఆందోళన కలిగిస్తుండడంతో.. చురుకైన ప్రెసిడెంట్ ఒకరు ఉండాలన్న అభిప్రాయం […]

సోనియా గాంధీ నాయకత్వం.. ఓ సస్పెన్స్.. తాత్కాలికమా ?శాశ్వతమా ?
Follow us on

130 ఏళ్లకు పైగా చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సమస్య సస్పెన్స్ లో పడింది. తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇలాగే తాత్కాలిక పదవిలో కొనసాగుతారా లేక శాశ్వతంగా పదవిలో ఉంటారా .. అదీ కాకపోతే.. పార్టీకి కొత్త అధ్యక్షుడిని నియమిస్తారా అన్నది తేలాల్సి ఉంది. ఏప్రిల్ రెండో వారంలో నిర్వహించనున్న ప్లీనరీ సమావేశాల్లో దీనిపై ఒక నిర్ణయం తీసుకోవచ్చునని తెలుస్తోంది. సోనియా ఆరోగ్యం తరచూ ఆందోళన కలిగిస్తుండడంతో.. చురుకైన ప్రెసిడెంట్ ఒకరు ఉండాలన్న అభిప్రాయం బలం పుంజుకుంటోంది. ముఖ్యంగా ఢిల్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ఈ అంశానికి ప్రాధాన్యత మరింత పెరిగింది. రెండో సారి ఈ ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమిని మూటగట్టుకోవడంతో పార్టీలో అప్పుడే లుకలుకలు మొదలయ్యాయి. పైగా పోటీ చేసిన 63 నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోవడంతోపరిస్థితి ఇంకా దారుణంగా మారింది. మూడుసార్లు సీఎం గా వ్యవహరించిన దివంగత షీలా దీక్షిత్  కారణంగానే పార్టీ బలం కోల్పోయిందని సీనియర్ నేత పీసీ చాకో అప్పుడే విమర్శలు ప్రారంభించారు. కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలకు ఆయన వ్యాఖ్యలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. నిజానికి లోక్ సభ ఎన్నికల నాటి నుంచే పార్టీ పరిస్థితి దిగజారుతూ వచ్చింది. రాహుల్ గాంధీ అధ్యక్ష పదవి నుంచి వైదొలగిన అనంతరం.. ఈ పోకడ ఇంకా పెరిగింది. పార్టీని సోనియా సమర్థంగా ముందుండి నడిపించగలరా అన్న సందేహాలు మొదలవుతున్నాయి. ఢిల్లీ ఎన్నికల్లో రాహుల్, ప్రియాంక గాంధీ విస్తృతంగా ప్రచారం చేసినా ఫలితం దక్కలేదు. బీజేపీని మట్టి గరపించి ఆప్ విజయ దుందుభి మోగించిన అంశమే కాంగ్రెస్ పార్టీకిఊరట కలిగించే విషయం.