Priyanka Gandhi: రాజ్యసభకు సోనియా గాంధీ.. లోక్‌సభ ఎన్నికల బరిలో ప్రియాంక.. పోటీచేసేది అక్కడి నుంచే..

|

Feb 12, 2024 | 7:41 PM

లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. దీంతో ప్రధాన పార్టీలన్నీ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. ఈ క్రమంలో బీజేపీని ఎలాగైనా గద్దె దించాలన్న వ్యూహాలతో కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. దీనికోసం కాంగ్రెస్.. జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలతో ఇండియా కూటమిని ఏర్పాటు చేసింది. అయితే.. ఎన్నికలు దగ్గరపడుతున్నా కొద్ది ఇండియా కూటమిలో విబేధాలు తారాస్థాయికి చేరుతున్నాయి..

Priyanka Gandhi: రాజ్యసభకు సోనియా గాంధీ.. లోక్‌సభ ఎన్నికల బరిలో ప్రియాంక.. పోటీచేసేది అక్కడి నుంచే..
Sonia Gandhi Priyanka Gandhi
Follow us on

లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. దీంతో ప్రధాన పార్టీలన్నీ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. ఈ క్రమంలో బీజేపీని ఎలాగైనా గద్దె దించాలన్న వ్యూహాలతో కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. దీనికోసం కాంగ్రెస్.. జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలతో ఇండియా కూటమిని ఏర్పాటు చేసింది. అయితే.. ఎన్నికలు దగ్గరపడుతున్నా కొద్ది ఇండియా కూటమిలో విబేధాలు తారాస్థాయికి చేరుతున్నాయి.. ఓ వైపు నితీష్ కుమార్ కూటమి నుంచి బయటకు వెళ్లిపోవడం, మరోవైపు మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ లాంటి నేతలు సీట్ల విషయంలో విమర్శలు చేస్తుండటంతో.. కాంగ్రెస్ పార్టీ నిత్యం ఏదో ఒక తలనొప్పితో సతమతమవుతోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ లోక్‌సభ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటారని జాతీయ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. ప్రత్యేక్ష పోటీ నుంచి తప్పుకుని.. రాజ్యసభకు వెళ్లాలని యోచిస్తున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. అయితే, రాయ్ బరేలీ లోక్ సభ సీటును ఆమె కూతురు ప్రియాంక వాద్రాకు అందజేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ రాజస్థాన్‌ నుంచి రాజ్యసభ స్థానానికి నామినేట్ అయ్యే అవకాశం ఉంది. ప్రియాంక గాంధీ రాయ్‌బరేలీ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రియాంక గాంధీ వాద్రాకు ఇదే మొదటి ఎన్నిక. అయితే, ప్రస్తుతం.. 77 ఏళ్ల సోనియాగాంధీ ఆరోగ్యం బాగాలేదు.. కావున వచ్చే రాజ్యసభ ఎన్నికల్లో జైపూర్ నుంచి నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఇది కాంగ్రెస్ లో భారీ మార్పు కాబోతుంది. సోనియా గాంధీ 2006 నుంచి రాయ్‌బరేలీ నుండి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019లో కూడా కాంగ్రెస్ పార్టీ సంక్షోభంలో చిక్కుకుంది.. పార్లమెంట్ ఎన్నికల్లో గట్టిగా పోటీ ఇవ్వలేకపోయింది. అయితే, ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ, అమేథీ గాంధీ కుటుంబానికి కంచుకోటల్లా ఉన్నాయి. ఆ సమయంలో కూడా సోనియాగాంధీ రాయ్‌బరేలీ నుంచి పోటీ చేసి గెలిచారు. రాహుల్ గాంధీ మాత్రం అమేథీలో బీజేపీకి నాయకురాలు స్మృతి ఇరానీపై ఓడిపోయారు.

అయితే, పార్టీలోకి వచ్చిన కొన్నేళ్ల తరువాత ఎన్నికల క్షేత్రంలో అడుగుపెడుతున్న ప్రియాంక గాంధీ వాద్రాకు రాయ్‌బరేలీ సురక్షితమైన సీటుగా పరిగణిస్తున్నారు. 1950ల నుండి కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో.. మొదట ఆమె తాత ఫిరోజ్ గాంధీ ప్రాతినిధ్యం వహించారు. అయితే, ప్రియాం గాంధీ అధికారికంగా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు 2019లో పోటీ చేస్తారని భావించారు. వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీకి, ఆమెకు మధ్య ముఖాముఖీ ఎదురుకావచ్చని చాలామంది ఆశించారు. కానీ అలా జరగలేదు..

అయితే ఆ సమయంలో పార్టీకి సారథ్యం వహించిన రాహుల్ గాంధీ, ఉత్తరప్రదేశ్‌లో పార్టీని పునరుద్ధరించే బాధ్యతను ఉత్తరప్రదేశ్ తూర్పు భాగానికి ఎఐసిసి ప్రధాన కార్యదర్శిగా, మొత్తం ఉత్తరప్రదేశ్‌కు ఇన్‌ఛార్జ్ జనరల్ సెక్రటరీగా ఆమెకు అప్పగించారు. కానీ 2019లో రాష్ట్రం నుంచి బీజేపీ భారీ విజయం సాధించడంతో పాటు 2022లో యోగి ఆదిత్యనాథ్ తిరిగి రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో ఆ ప్రయత్నం ఫలించలేదు..

ప్రియాంక గాంధీ వాద్రా కు సహచరుడు, ఉత్తరప్రదేశ్‌కు ఇన్‌ఛార్జ్‌గా ఉన్న జ్యోతిరాదిత్య సింధియా ఆ తర్వాత బిజెపిలో చేరారు. ఆ తర్వాత రాయ్‌బరేలికి ప్రాతినిధ్యం వహిస్తున్న సోనియా గాంధీ ఆరోగ్యం బాలేకపోవడంతో.. సార్వత్రిక ఎన్నికలకు ముందు రాష్ట్రంలో పార్టీ పునరుజ్జీవనం కోసం ప్రియాంక గాంధీని రంగంలోకి దింపనున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ కల్ిక్ చేయండి..