Sonia Gandhi: పూర్తిగా విఫలం అయ్యారు.. వివక్ష చూపారు..ఇకనైనా మేల్కోండి..కేంద్రంపై విరుచుకుపడిన సోనీయా గాంధీ

|

Apr 17, 2021 | 8:17 PM

కోవిడ్ పరిస్థితులను ఎదుర్కోవడంలో కేంద్ర ప్రభుత్వం దారుణంగా విఫలం అయిందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్రంగా విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం కరోనా విషయంలో చాలా అలసత్వంతో పనిచేసిందని ఆమె అన్నారు.

Sonia Gandhi: పూర్తిగా విఫలం అయ్యారు.. వివక్ష చూపారు..ఇకనైనా మేల్కోండి..కేంద్రంపై విరుచుకుపడిన సోనీయా గాంధీ
AICC Chief sonia gandhi
Follow us on

Sonia Gandhi: కోవిడ్ పరిస్థితులను ఎదుర్కోవడంలో కేంద్ర ప్రభుత్వం దారుణంగా విఫలం అయిందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్రంగా విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం కరోనా విషయంలో చాలా అలసత్వంతో పనిచేసిందని ఆమె అన్నారు. అదీకాకుండా ఇటువంటి మహమ్మారిపై పోరాటంలో అందరినీ కలుపుకోవాల్సింది పోయి, కొన్ని రాష్ట్రాల పై వివక్ష చూపించిందని సోనియా తీవ్రంగా ఆరోపించారు. దేశవ్యాప్తంగా కరోనా పరిస్థితులపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఈరోజు వర్చువల్ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో కరోనా ఎదుర్కోవడానికి అనుసరించాల్సిన విధివిధానాలపై చర్చించారు.

పార్టీలకతీతంగా కరోనాపై పోరాడాలని కాంగ్రెస్ భావించిందని సోనియా చెప్పారు. ఈ పరిస్థితిని జాతీయ స్థాయిలో ఓ సవాల్ గా పరిగణించామన్నారు. అయితే, ప్రభుత్వం మాత్రం కుత్సితంగా వ్యవహరించింది అని ఆరోపించారు. రాష్ట్రాల మధ్యలో తేడాను చూపించిందని విమర్శించారు. ఏడాది సన్నద్ధత ఉన్నప్పటికీ రెండో వేవ్‌ను నిలువరించడంలో ఘోరంగా విఫలమయ్యామని విచారం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ప్రతిపక్ష పార్టీ ఇచ్చిన నిర్మాణాత్మక సలహాలను స్వీకరించడానికి బదులు కేంద్రమంత్రులు ఎదురుదాడికి దిగారని ఆరోపించారు. ఇక ఈ సమావేశంలో వివిధ అంశాలను చర్చించిన అనంతరం కేంద్రానికి కరోనాను ఎదుర్కునే విషయంలో కొన్ని సూచనలు చేసింది. ముఖ్యంగా వ్యాక్సినేషన్ విషయంలో పలు సలహాలు ఇచ్చింది.

ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి సోనియా గాంధీ కొన్ని సూచనలు చేశారు. 25 ఏళ్లు పైబడిన వారందరికీ టీకా ఇచ్చేందుకు అనుమతించాలని కోరారు. అలాగే ఇటీవల కాంగ్రెస్‌, యూపీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో చర్చించిన అంశాలను ఈ సందర్భంగా పంచుకున్నారు. కరోనాను నిరోధించేందుకు కావాల్సిన వైద్య పరికరాలు, ఔషధాలు సహా ఇతరత్రా సహాయ సామగ్రిపై జీఎస్టీని రద్దు చేయాలని కోరారు. ఇప్పటికీ మెడికల్‌ ఆక్సిజన్‌, రెమ్‌డెసివిర్‌ వంటి ఔషధాలపై 12 శాతం జీఎస్టీ కొనసాగడం దురదృష్టకరమన్నారు. మరోసారి విధిస్తున్న లాక్‌డౌన్‌లు, ఇతర ఆంక్షలు ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తాయని ఆమె అన్నారు. ఫలితంగా పేదలు, రోజు కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోనున్నారని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో అర్హులైన వారందరి ఖాతాలో రూ.6,000 జమ చేయాలని కోరారు.

Also Read: Nagarjuna Sagar By Election: సాగర్ ఉప ఎన్నిక పోరు ప్రశాంతం.. మే 2న ఎన్నిక కౌటింగ్.. గెలుపు అంచనాల్లో పార్టీలు

ముగిసిన తిరుపతి ఉప ఎన్నిక.. వైసీపీ అక్రమాలకు పాల్పడిందన్న ప్రతిపక్షాలు.. ఎన్నిక రద్దుకు డిమాండ్