Sonia Gandhi Corona: సోనియా గాంధీకి కరోనా పాజిటివ్.. హోం ఐసోలేషన్‌లో చికిత్స..

|

Jun 02, 2022 | 2:33 PM

Sonia Gandhi Corona Positive: సోనియా గాంధీ కరోనా సోకింది. ఈ మేరకు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా వెల్లడించారు. గతంలో సోనియా గాంధీని కలిసిన చాలా మంది నాయకులు, కార్యకర్తలు కూడా కరోనా బారిన పడ్డారని రణదీప్ సూర్జేవాలా చెప్పారు. 

Sonia Gandhi Corona: సోనియా గాంధీకి కరోనా పాజిటివ్.. హోం ఐసోలేషన్‌లో చికిత్స..
Sonia Gandhi
Follow us on

Sonia Gandhi Corona Positive: సోనియా గాంధీ కరోనా సోకింది. ఈ మేరకు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా వెల్లడించారు. గతంలో సోనియా గాంధీని కలిసిన చాలా మంది నాయకులు, కార్యకర్తలు కూడా కరోనా బారిన పడ్డారని రణదీప్ సూర్జేవాలా చెప్పారు. సుర్జేవాలా ఇచ్చిన సమాచారం  ప్రకారం, సోనియా గాంధీకి నిన్న (బుధవారం) సాయంత్రం తేలికపాటి జ్వరం వచ్చింది. ఆ తర్వాత ఆమెకు కోవిడ్ పరీక్షలో పాజిటివ్ తేలింది.  సోనియా గాంధీ ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నారని సూర్జేవాలా వెల్లడించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న ఆమె కోలుకుంటున్నారని తెలిపారు. గత వారం రోజులుగా సోనియా అనేక మంది నేతలు, కార్యకర్తల్ని కలుస్తున్నారని.. వారిలో కొందరికి కొవిడ్ పాజిటివ్​గా తేలినట్లు వివరించారు. తాము ముందుగా చెప్పినట్టు.. ఈనెల 8న నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణ కోసం ఎన్​ఫోర్స్​మెంట్​ డైరక్టరేట్ ఎదుట ఆమె హాజరవుతారని చెప్పారు. జూన్ 8లోపు సోనియా ఆరోగ్యం కుదుట పడుతుందని సుర్జేవాలా ఆశాభావం వ్యక్తం చేశారు. జూన్ 8న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆయనను విచారణకు పిలిచిన సంగతి తెలిసిందే. నేషనల్ హెరాల్డ్‌కు సంబంధించిన కేసులో ఈ విచారణ జరగాల్సి ఉంది. రెండు మూడు రోజుల్లో సోనియాగాంధీ కోలుకుంటారని ఆశిస్తున్నామని సూర్జేవాలా అన్నారు.

ఇదే కేసులో పార్టీ అగ్రనేత రాహుల్​ గాంధీని.. గురువారం విచారణకు హాజరుకావాలని ఈడీ సమన్లు పంపింది . అయితే.. ముందే నిర్ణయించిన షెడ్యూల్​ ప్రకారం ఇతర కార్యక్రమాలు ఉన్నందున రావడం సాధ్యం కాదని రాహుల్​.. సమాచారం పంపారు. విచారణలో పాల్గొనేందుకు మరింత సమయం కావాలని ఈడీని కోరినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

జాతీయ వార్తల కోసం..