కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. ఆమెను ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆసుపత్రిలో గురువారం చేర్పించారు. ఆమె జ్వరంతో బాధపడుతున్నట్లు ఆసుపత్రి విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ఆమెను పరిశీలిస్తున్నామని, పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపింది. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.
సోనియా గాంధీని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఛెస్ట్ మెడిసిన్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ అరూప్ బసు నేతృత్వంలోని వైద్యుల బృందం పర్యవేక్షిస్తోంది. జ్వరం కారణంగా నిన్న గురువారం రోజునే ఆమె ఆస్పత్రిలో చేరినట్టు తెలుస్తోంది. సోనియాకు డాక్టర్లు కొన్ని వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.
గత సంవత్సరం జూన్‌లో కూడా సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. ఆ తర్వాత ఆమె జూన్ 18, 2022న సర్ గంగారామ్ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. కోవిడ్‌కు సంబంధించిన సమస్యల కారణంగా జూన్ 12న అడ్మిట్ అయ్యారు. సోనియా గాంధీ గతంలో రెండుసార్లు కోవిడ్ బారినపడ్డారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..