సోనాభద్ర ఊచకోత.. ఒళ్ళు జలదరించే వీడియో

ఇటీవల యూపీలోని సోనాభద్ర జిల్లాలో అగ్రవర్ణాలకు, గిరిజనులకు మధ్య రేగిన భూవివాదంలో 10 మంది మరణించగా.. 28 మంది గాయపడ్డారు. దేశవ్యాప్త సంచలనం రేపిన ఈ ఘటన తాలూకు వీడియో తాజాగా బయటికొచ్చింది. ఈ జిల్లాలోని ఘొరావల్ గ్రామంలో గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములు తమవేనంటూ యాగ్యా దత్ అనే సర్పంచ్ ఆధ్వర్యంలో అగ్రవర్ణాలు ఒక్క ఉదుటున ఆ గ్రామంలోకి ట్రాక్టర్లు, ఇతర వాహనాల్లో వచ్చిపడ్డారు. దాదాపు 200 మంది ఆ గ్రామంలో గన్స్, కర్రలతో వీర […]

సోనాభద్ర ఊచకోత.. ఒళ్ళు జలదరించే వీడియో

Updated on: Jul 22, 2019 | 6:33 PM

ఇటీవల యూపీలోని సోనాభద్ర జిల్లాలో అగ్రవర్ణాలకు, గిరిజనులకు మధ్య రేగిన భూవివాదంలో 10 మంది మరణించగా.. 28 మంది గాయపడ్డారు. దేశవ్యాప్త సంచలనం రేపిన ఈ ఘటన తాలూకు వీడియో తాజాగా బయటికొచ్చింది. ఈ జిల్లాలోని ఘొరావల్ గ్రామంలో గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములు తమవేనంటూ యాగ్యా దత్ అనే సర్పంచ్ ఆధ్వర్యంలో అగ్రవర్ణాలు ఒక్క ఉదుటున ఆ గ్రామంలోకి ట్రాక్టర్లు, ఇతర వాహనాల్లో వచ్చిపడ్డారు. దాదాపు 200 మంది ఆ గ్రామంలో గన్స్, కర్రలతో వీర విహారం చేశారు. తమకు ఎదురొచ్చిన వారి[పై విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డారు. 90 బీఘాల వివాదాస్పద భూమి మాదేనని, ఇక్కడినుంచి వెళ్లకపోతే.. మీకు చావే గతి అంటూ వారు బెదిరించారు. కొంతమంది గాల్లోకి కాల్పులు జరపగా, మరికొంతమంది.. తమను ఎదిరించినవారిపై నేరుగా కాల్పులు జరపడంతో ఆ ప్రాంతమంతా గిరిజనుల కేకలు, గాయపడినవారి ఆర్తనాదాలతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. భయపడి పారిపోతున్నవారిని కూడా యాగ్యా దత్ అనుచరులు వదలలేదు. తీవ్ర గాయాలతో నలుగురు మహిళలు కూడా ఆ ఘటనలో మృతి చెందారు.
కాగా-ఈ సంఘటనలో మృతులు, క్షతగాత్రుల కుటుంబాలను పరామర్శించేందుకు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ప్రయత్నించగా ఆమెను మీర్జాపూర్ లోని గెస్ట్ హౌస్ లో పోలీసులు నిర్బంధించడం, చివరకు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం దిగివఛ్చి ఆమెను అనుమతించడం తెలిసిందే. అటు-సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదివారం ఘోరావల్ గ్రామాన్ని సందర్శించి బాధితులను ఆదుకుంటామని హామీఇచ్చారు.