Jammu: జమ్మూ కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. జవాన్‌ మృతి

జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో గురువారం భద్రతా దళాలు ప్రారంభించిన కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్‌లో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక సైనికుడు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. గురువారం ఉదయం భద్రతాదళాలు, ఉగ్రవాదుల మధ్య చోటుచేసుకున్న కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్టుగా అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ జరుగుతోంది.

Jammu: జమ్మూ కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. జవాన్‌ మృతి
Encounter In Jammu

Updated on: May 22, 2025 | 6:02 PM

జమ్మూకశ్మీర్‌లోని సింగ్‌పోరా ప్రాంతంలో ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఎన్‌కౌంటర్‌లో భారత జవాన్ మృతి చెందాడు. జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో గురువారం భద్రతా దళాలు ప్రారంభించిన కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్‌లో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక సైనికుడు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. గురువారం ఉదయం భద్రతాదళాలు, ఉగ్రవాదుల మధ్య చోటుచేసుకున్న కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్టుగా అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ జరుగుతోంది.

ఛత్రులోని శింగ్‌పోరా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే పక్కా సమాచారం మేరకు భద్రతా దళాలు సెర్చ్‌ ఆపరేషన్ నిర్వహిస్తుండగా ఈ కాల్పులు జరిగాయని వారు తెలిపారు. ఆ ప్రాంతంలో నలుగురు ఉగ్రవాదులు నక్కినట్టుగా సమాచారం అందిందని చెప్పారు. ఈ ఉదయం కిష్త్వార్‌లోని ఛత్రు వద్ద పోలీసులతో సంయుక్త ఆపరేషన్ సందర్భంగా ఉగ్రవాదులతో ఎదురు కాల్పులు జరిగాయి. అదనపు దళాలను మోహరించామని, ఉగ్రవాదులను మట్టుబెట్టడానికి ఆపరేషన్ కొనసాగుతోందని చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..