Weather: దేశంలో విచిత్ర వాతావరణం.. భగభగ మండే ఎండకాలంలో మంచు వర్షం.. జీరో డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..

|

Apr 21, 2023 | 6:07 AM

ఉత్తర భారతదేశంలో విచిత్ర వాతావరణం నెలకొంది. ఓ వైపు ఎండలు దంచికొడుతుండగా.. మరోవైపు విపరీతమైన మంచు కురుస్తుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. బద్రీనాథ్, కేదార్‌నాథ్‌ ఆలయాలను వింటర్‌ మాదిరిగా.. సమ్మర్‌లో మంచు దుప్పటి కప్పేసింది.

Weather: దేశంలో విచిత్ర వాతావరణం.. భగభగ మండే ఎండకాలంలో మంచు వర్షం.. జీరో డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..
Snow Fall
Follow us on

ఉత్తర భారతదేశంలో విచిత్ర వాతావరణం నెలకొంది. ఓ వైపు ఎండలు దంచికొడుతుండగా.. మరోవైపు విపరీతమైన మంచు కురుస్తుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. బద్రీనాథ్, కేదార్‌నాథ్‌ ఆలయాలను వింటర్‌ మాదిరిగా.. సమ్మర్‌లో మంచు దుప్పటి కప్పేసింది.

ఉష్ణోగ్రతల్లో సరికొత్త రికార్డులు..

దేశంలో ఒకవైపు విపరీతమైన ఎండలు కాస్తున్నాయి. ప్రజలు భయటకు రావాలంటేనే భయపడిపోతున్నాయి. అంతగా ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉష్ణోగ్రతల్లో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. కానీ.. ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు మాత్రం శీతాకాలాన్ని తలపిస్తున్నాయి. అకస్మాత్తుగా పర్వత ప్రాంతాల్లో విపరీతమైన మంచు కురుస్తోంది. బద్రీనాథ్ ఆలయ పరిసరాలన్నీ మంచుతో కప్పబడ్డాయి. బద్రీనాథ్ దేవాలయం దగ్గర మంచు దుప్పటి పరుచుకుంది. ఉష్ణోగ్రతలు సున్నా డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయాయి.

పలు ప్రాంతాల్లో మంచు..

చమోలి జిల్లాలోని బద్రీనాథ్‌లో గురువారం మంచు భారీ కురిసింది. మంచు భారీగా కురవడంతో ఆయా ప్రాంతాలన్నీ గడ్డకట్టిపోతున్నాయి. మార్చిలోనూ చమోలి జిల్లాతోపాటు జోషిమట్‌‌లోని ఎత్తైన పర్వత శ్రేణులు, బద్రీనాథ్ ఆలయ ప్రాంతాలు మంచు దుప్పటితో కప్పబడ్డాయి. బద్రీనాథ్‌తోపాటు కేదార్‌నాథ్ పర్వత శిఖరాల్లోనూ మంచు కురుస్తోంది. అయితే.. దిగువ ప్రాంతాల్లో అడపాదడపా కురుస్తున్న వర్షాలు.. రాబోయే చార్ ధామ్ యాత్ర సన్నాహాలకు అడ్డంకిగా మారాయని అధికారులు చెబుతున్నారు. బద్రీనాథ్, కేదార్‌నాథ్ పుణ్యక్షేత్రాలు ఉన్న చమోలి, రుద్ర ప్రయాగ్ జిల్లాల్లో మంచు గాలుల కారణంగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఏప్రిల్ 25న భక్తుల కోసం తెరుచుకోనున్న ట్రెక్ మార్గం కూడా ప్రస్తుతం హిమపాతంతో నిండిపోయింది.

ఇవి కూడా చదవండి

ఇక.. ఆయా ప్రాంతాల్లో కొన్ని గంటల్లోనే రెండు అంగుళాల మేర మంచు పేరుకుపోయింది. గంగోత్రి దగ్గర కూడా శీతల వాతావరణం నెలకొంది. అటు హిమాచల్‌ప్రదేశ్‌ లహోల్ స్పితి జిల్లాలో నాలుగు అంగుళాల మేర మంచు పేరుకుపోయింది. మంచు దుప్పటి కప్పేయడంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. అటల్ టన్నెల్లో సైతం నాలుగు అంగుళాల మేర మంచు గడ్డకట్టింది. ఈ పరిస్థితులు మరికొన్ని రోజులు కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. మొత్తంగా.. ఉత్తరభారతంలోని పలు ప్రాంతాల్లో సమ్మర్‌లో భారీగా మంచు, వర్షం కురవడం విశేషంగా మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..