Modi Cabinet Ministers Assets: సెంట్రల్ కేబినెట్లో స్మార్ట్ ఇన్వెస్టింగ్ మినిస్టర్స్ వివరాలివి. అయితే, ప్రధాని నరేంద్ర మోదీ రూటు మాత్రం సెపరేటుగా ఉంది. మోదీ ఎలాంటి వ్యాపార, ఆర్థిక కార్యకలాపాలు చేపట్టడంలేదు. ఆయన ఆస్తుల్లో పెరుగుదల కేవలం బ్యాంకులోని ఫిక్సిడ్ డిపాజిట్ల వల్ల పెరిగింది మాత్రమే. ఇక, ఈ ఏడాది ఆస్తులకు సంబంధించి ప్రధాని మోదీ తాజా డిక్లరేషన్ ఇలా ఉంది.
> మోడీ నికర ఆస్తి విలువ 2020-21 నాటికి రూ.3.07 కోట్లు
> 2019-20 లో మోడీ నికర ఆస్తి విలువ రూ.2.85 కోట్లు
> 2019-20 తో పోలిస్తే 7శాతం(రూ.22 లక్షలు) పెరిగిన మోడీ ఆస్తి విలువ
> మోడీ ఆస్తుల విలువలో పెరుగుదలకు కారణం బ్యాంకుల్లో ఉన్న ఫిక్స్ డ్ డిపాజిట్లే
> స్టాక్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్ మెంట్ చేయని మోడీ
ఇక, మోదీ కేబినేట్‌లో స్మార్ట్ ఇన్వెస్టింగ్ మినిస్టర్స్ వివరాలు వెలుగులోకి వచ్చాయి. స్టాక్ మార్కెట్లలో స్మార్ట్ పెట్టుబడులతో లాభాలు మూటగట్టుకున్నారు మంత్రులు. టాప్‌లో కేంద్ర హోమంత్రి అమిత్ షా స్థానం దక్కించుకున్నారు. ప్రతికూల కాలంలో సైతం లాభాల బాటలో భారత స్టాక్ మార్కెట్లు ఉండటంతో 2020 – 21లో సెన్సెక్స్, నిఫ్టీ లకు దాదాపుగా70 శాతం లాభాలు వచ్చాయి. గత 11 ఏళ్లలో ఇదే అత్యధిక లాభం. 2020-21 కాలంలో భారత్ మార్కెట్ క్యాపిటలైజేషన్ లో పెరుగుదల 80శాతం(రూ.91 ట్రిలియన్లు) పెరిగి రూ.204 ట్రిలియన్లుగా నమోదు చేసుకుంది.
దీంతో పలు స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టిన కేంద్ర కేబినేట్ మంత్రులకూ లాభాలు భారీగా వచ్చాయి. తాజాగా ప్రధానమంత్రి కార్యాలయానికి సమర్పించిన డిక్లరేషన్లలో వెల్లడైన వివరాలిలా ఉన్నాయి. ఇక, కేంద్ర మంత్రుల్లో అత్యధిక ధనవంతుడుగా అమిత్ షా ఉన్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నికర ఆస్తుల విలువ 32 శాతం పెరిగి రూ.37,91,50,580 (రూ.38 కోట్లు)గా ఉంది. షా ఆస్తి విలువ పెరుగుదలలో అత్యధిక వాటా షేర్లదే. 74 శాతం పెరిగిన షా చేతిలో ఉన్న పలు కంపెనీల షేర్ల ధరలు.
> తన మొత్తం షేర్ల విలువ రూ.24.5 కోట్లని వెల్లడించిన షా
> 2019-20 సంవత్సరంలో షా మొత్తం షేర్ల విలువ రూ.13.5 కోట్లు మాత్రమే
> ప్రస్తుతం షా వద్ద ఉన్న షేర్లలో వారసత్వంగా సంక్రమించిన రూ.19.7 కోట్ల విలువైన షేర్లు
> అమిత్ షా సొంతంగా కొన్న షేర్ల విలువ రూ.3.78 కోట్లు
> 2019 లోక్ సభ ఎన్నికల సందర్భంగా షా ఈసీకి సమర్పించిన అఫిడవిట్ ప్రకారం ఉన్న 190 కి పైగా లిస్టెడ్ కంపెనీల షేర్లు
> షా వద్ద ఉన్న టాప్ కంపెనీల షేర్లలో రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎల్ అండ్ టీ ఫైనాన్స్, టాటా కన్సట్టెన్సీ సర్వీసెస్, అల్ట్రాటెక్ సిమెంట్, హిందుస్థాన్ యూనీలీవర్, మారుతి సుజుకి, ఐటీసీ
మరో ధనిక మంత్రి పీయూష్ గోయల్..
> మోడీ కేబినెట్లో ధనిక మంత్రుల్లో వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఒకరు
> 2020-21లో గోయల్ నికర ఆస్తి విలువ గత ఏడాదితో పోలిస్తే 10శాతం(రూ.2.8 కోట్లు) పెరుగుదల
> రూ.30.26 కోట్లకు చేరిన గోయల్ నికర ఆస్తి విలువ
> వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ షేర్ల విలువలో 96శాతం హైక్..
> 2019-20 ఆర్థిక సంవత్సరంలో షేర్ల విలువ రూ.2.72 కోట్లు
> 2020-21 ఆర్థిక సంవత్సరంలో షేర్ల విలువ రూ.5.33 కోట్లు
హర్దీప్ పురి:
> తగ్గిన పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ పురి ఆస్తి విలువ..
> మల్టీ నేషనల్ ఇన్వెస్ట్ మెంట్ కంపెనీ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంక్షోభంతో తగ్గిన హర్దీప్ పురి ఆస్తి విలువ
> 2019-20లో నష్టాన్ని చవిచూసిన ఫ్రాంక్లిన్ క్రెడిట్ రిస్క్ ఫండ్ లో హర్దీప్ పెట్టుబడులు
> ఫ్లాంక్లిన్ క్రెడిట్ రిస్క్ ఫండ్ లో తన పెట్టుబడుల విలువ రూ.18.6 లక్షలని తాజాగా డిక్లరేషన్లో వెల్లడించిన హర్దీప్ పురి
ఆశ్వనీ వైష్ణవ్:
> ఈ ఏడాది కేబినెట్ విస్తరణలో రైల్వే మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆశ్వనీ వైష్ణవ్ చేతిలో మూడు లిస్టెడ్ కంపెనీల షేర్లు
> ఇవి గుజరాత్ ఫెర్టి లైజర్స్ అండ్ కెమికల్స్, ఎల్ అండ్ టీ, వేదాంత కంపెనీలకు చెందిన షేర్ల విలువ రూ.6.23 లక్షలు
జ్యోతిరాదిత్య సింధియా:
> పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ మెంట్స్ రూ.11 లక్షలు
> సింధియా మొత్తం ఆస్తి విలువ రూ.35.4 కోట్లు
>సింధియా మొత్తం ఆస్తి విలువలో మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడుల వాటా స్వల్పమే
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్:
> నిర్మల నికర ఆస్తుల్లో స్వల్ప మార్పు మాత్రమే నమోదైందని వెల్లడి
> స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులకు సంబంధించి వివరాలు బహిరంగపర్చలేదు
> 2019-20 లో డిక్లరేషన్ లో పేర్కొన్న రూ.1.4 కోట్ల ఆస్తినే 2020-21లో ఉందని వెల్లడించిన నిర్మల
రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్:
> స్వల్పంగా తగ్గిన రాజ్ నాథ్ మొత్తం ఆస్తి విలువ
> 2019-20లో రాజ్ నాథ్ ఆస్తి విలువ రూ.5.21 కోట్లు
> 2020-21 లో రాజ్ నాథ్ ఆస్తి విలువ రూ.4.93 కోట్లు
Read also: International News: అంతర్జాతీయ అద్భుతాలు, నేటి వింతలు విశేషాలు, షాకులు.. సంచలనాలు