Padma Awards 2023: ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం.. ముగ్గురికి పద్మవిభూషణ్‌, నలుగురికి పద్మభూషణ్‌..

|

Mar 23, 2023 | 4:20 AM

పద్మ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ముగ్గురికి పద్మవిభూషణ్‌, నలుగురికి పద్మభూషణ్‌ అవార్డులను బహుకరించారు. తెలంగాణకు చెందిన కమలేశ్‌ డి పటేల్‌కు పద్మభూషణ్‌ అవార్డు దక్కింది.

Padma Awards 2023: ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం.. ముగ్గురికి పద్మవిభూషణ్‌, నలుగురికి పద్మభూషణ్‌..
Padma Awards
Follow us on

పద్మ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ముగ్గురికి పద్మవిభూషణ్‌, నలుగురికి పద్మభూషణ్‌ అవార్డులను బహుకరించారు. తెలంగాణకు చెందిన కమలేశ్‌ డి పటేల్‌కు పద్మభూషణ్‌ అవార్డు దక్కింది. ఏపీకి చెందిన సంకురాత్రి చంద్రశేఖర్‌, తెలంగాణకు చెందిన విజయ్‌ గుప్తా తదితరులకు పద్మశ్రీ అవార్డులు దక్కాయి.

రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డుల ఫంక్షన్‌ కన్నుల పండువగా జరిగింది. ప్రధాని మోదీ కేంద్రమంత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రాజకీయ రంగంలో చేసిన సేవలకు మాజీ కేంద్రమంత్రి ఎస్‌ఎం కృష్ణకు పద్మవిభూషణ్‌ అవార్డును బహుకరించారు. మొత్తం 54 మందికి తొలివిడతలో రాష్ట్రపతి ద్రౌపదిముర్ము అవార్డులను ప్రధానం చేశారు.

తెలంగాణకు చెందిన కమలేశ్‌ డి పటేల్‌కు సామాజిక సేవారంగంలో పద్మభూషణ్‌ అవార్డును ప్రదానం చేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. అదే రంగంలో ఏపీకి చెందిన సంకురాత్రి చంద్రశేఖర్‌, శాస్త్రసాంకేతిర రంగాల్లో తెలంగాణకు చెందిన విజయ్‌ గుప్తాకు పద్మశ్రీ లభించింది. తెలంగాణాకే చెందిన సాహితివేత్త రామకృష్ణారెడ్డికి, డాక్టర్‌ హనుమంతరావుకు పద్మశ్రీ అవార్డులను బహుకరించారు.

ఇవి కూడా చదవండి

ప్రముఖ పారిశ్రామికవేత్త కుమారమంగళం బిర్లాకు పద్మభూషణ్‌ ఇచ్చారు. ఏపీకి చెందిన చింతలపాటి వెంకటపతిరాజుకు, సచ్చిదానంద శాస్త్రికి కూడా పద్మశ్రీ అవార్డును బహుకరించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..