Chhattisgarh Train Accident : చత్తీస్‌ఘడ్‌లో ఘోర ప్రమాదం.. ఢీకొన్న రెండు రైళ్లు

చత్తీస్‌ఘడ్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. బిలాస్‌పూర్‌ దగ్గర ఆగి ఉన్న గూడ్సు రైలును కోర్బా ప్యాసింజన్‌ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు చనిపోయారు. ప్యాసింజర్‌ రైలు ఇంజన్‌ గూడ్సు రైలు పైకి ఎక్కింది. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.

Chhattisgarh Train Accident : చత్తీస్‌ఘడ్‌లో ఘోర ప్రమాదం.. ఢీకొన్న రెండు రైళ్లు
Bilaspur Train Accident

Updated on: Nov 04, 2025 | 5:31 PM

ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. బిలాస్‌పూర్ జిల్లాలోని లాల్‌ఖాదన్ సమీపంలో మంగళవారం ఒక ప్యాసింజర్ రైలు, గూడ్స్ రైలు ఢీకొన్నాయి. దీంతో అనేక బోగీలు పట్టాలు తప్పాయి. పలువురు ప్రయాణికులు మృతి చెందారు. చాలా మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. అయితే అధికారులు ఇంకా ఖచ్చితమైన సంఖ్యలను నిర్ధారించలేదు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే రైల్వే అధికారులు, పోలీసులు సమాచారం ఇచ్చారు. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే సిబ్బంది. పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

ప్రమాదంలో మృతి చెందిన వారి మృతదేహాలను వెలికి తీసి అంబులెన్స్‌ ద్వారా సమీప హాస్పిటల్‌కు తరలించారు. గాయాపడిన వారిని కూడా హాస్పిటల్‌కు తరలిస్తున్నారు. అలాగే ట్రైన్‌లోని ప్రయాణికులను రోడ్డు మార్గానా గమ్య స్థానాలకు చేర్చేందుకు రైల్వే అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. అంతేకాకుండా ఈ ప్రమాదం కారణంగా ఆరూట్‌లో నడిచే రైళ్ల రాకపోకలను ఇతర రూట్‌లో మళ్లించనున్నట్టు తెలిపారు.

ప్రమాదం ఎప్పుడు జరిగింది. ఎలా జరిగింది.

బిలాస్‌పూర్ రైల్వే డివిజన్ పరిధిలోని లాల్‌ఖాదన్ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో ఈ హృదయ విదారకమైన రైలు ప్రమాదం జరిగింది. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, ప్యాసింజర్ రైలు హౌరా వైపు వెళుతుండగా ఎదురుగా వస్తున్న గూడ్స్‌ రైలును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రైలు ముందు కోచ్ పూర్తిగా ధ్వంసమైంది, అలాగే గూడ్స్ రైలు ఇంజిన్ కూడా తీవ్రంగా దెబ్బతింది. రైలు ఢీకొట్టిన తీవ్రతకు ప్యాసింజర్‌ ట్రైన్‌లోని చాలా వరకు కోచ్‌లు పట్టాలు తప్పాయి. దీంతో చుట్టుపక్కల ప్రాంతం మొత్తం యుద్ధభూమిగా మారిపోయింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.