Assam Mizoram Clashes : అసోం – మిజోరం రాష్ట్రాల సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం.. ఆరుగురు పోలీసులు మృతి

|

Jul 27, 2021 | 8:58 AM

అసోం - మిజోరం రాష్ట్రాల మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడింది. ఒకచోట BJP సర్కార్‌.. మరోచోట NDA కూటమి ప్రభుత్వం. ఇరు రాష్ట్రాల మధ్య జరిగిన కాల్పుల్లో..

Assam Mizoram Clashes :  అసోం - మిజోరం రాష్ట్రాల సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం.. ఆరుగురు పోలీసులు మృతి
Assam
Follow us on

Assam – Mizoram border clash : అసోం – మిజోరం రాష్ట్రాల మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడింది. ఒకచోట BJP సర్కార్‌.. మరోచోట NDA కూటమి ప్రభుత్వం. ఇరు రాష్ట్రాల మధ్య జరిగిన కాల్పుల్లో ఆరుగురు పోలీసులు మృతి చెందారు. దీంతో అసోం – మిజోరాం సరిహద్దు వివాదం హింసాత్మకమైంది.

అసోంలోని కాచల్ జిల్లా – మిజోరాంలోని కోలాసిబ్ జిల్లాల మధ్య సరిహద్దు వివాదం చినికి చినికి గాలివానలా మారి చివరికి ఈ స్థాయికి చేరింది. మిజోరాం – అసోం రైతుల మధ్య తొలుత మొదలైన ఘర్షణ.. కర్రలు, రాళ్లతో పరస్పర దాడులు జరిగాయి. సరిహద్దుకు ఇరువైపులా రెండు రాష్ర్టాలు పోలీసులను మోహరించాయి.

ఘర్షణల్లో 6 గురు అస్సాం పోలీసులు మృతి చెందగా, మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సిల్చార్ మెడికల్ కాలేజి ఆస్పత్రిలో మరో 80 మందికి చికిత్స అందిస్తున్నారు. మిజోరాం వైపు నుంచి జరిపిన కాల్పుల్లో కాచర్ జిల్లా ఎస్పీ నింబల్కర్ వైభవ్ చంద్రకాంత్‌కు సైతం గాయాలపాలయ్యారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు అసోం – మిజోరాం ముఖ్యమంత్రులు.

దీంతో ఇరు రాష్ట్రాల సరిహద్దు ఘర్షణలపై రంగంలోకి కేంద్ర హోంశాఖ దిగింది. ఇద్దరు ముఖ్యమంత్రులతో ఫోన్లో మాట్లాడిన అమిత్ షా.. సరిహద్దు ప్రాంతాలకు 2 కంపెనీల సీఆర్పీఎఫ్ బలగాలు పంపించారు.

Read also : Visakha : నేడే గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నిక