కర్ణాటకలో ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని అందుకు తనను సుఖ పెట్టాలని ఓ మహిళను కోరాడంటూ బీజేపీకి చెందిన మాజీ మంత్రి రమేష్ జర్కిహోలిపై వచ్చిన ఆరోపణలకు ఆధారాలు లేవని ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్న ‘సిట్’ బృందం నిర్ధారించింది.తనకు ప్రభుత్వ జాబ్ కావాలని కోరి వచ్చిన తనను ఆయన ఈ కోర్కె కోరాడని, ఆ మహిళ అప్పట్లో ఆరోపించింది కూడా.. గత మార్చిలో ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయ్యాయి. అయితే వీటితో తనకు సంబంధం లేదని, ఈ మహిళ చేసిన ఆరోపణలు నిరాధారాలని గోకక్ ఎమ్మెల్యే అయిన రమేష్ జర్కిహోలి ఆ నాడే ఖండించారు.గత మార్చిలో ఈ వ్యవహారం కర్ణాటకలో పెద్ద దుమారాన్నే రేపింది. దీనిపై విచారణకు ప్రభుత్వం సిట్ బృందాన్ని నియమించింది. అయితే ఈయనను మగ్గు లోకి లాగేందుకు ఓ హానీ ట్రాప్ గ్యాంగ్ ఈ మహిళను వినియోగించుకుందని సిట్ టీమ్ కనుగొంది. రమేష్ నుంచి డబ్బు గుంజేందుకు ఈమెను ‘ఎర’ గా వేశారని ఆ తరువాత తమ ఇన్వెస్టిగేషన్ లో తెలుసుకుంది.
ఈమెను ఆయన వద్దకు పంపి రహస్యంగా వారి రాసలీలలను వీడియోగా తీసి ఆయనను ఒక విధంగా బ్లాక్ మెయిల్ చేయాలన్నది ఈ గ్యాంగ్ ఉద్దేశంగా ఉన్నట్టు కూడా ఆ మధ్య వార్తలు వచ్చాయి. పైగా సదరు మహిళ పరారీలో ఉందని రాష్ట్ర హోమ్ మంత్రి బసవరాజ్ బొమ్మై అప్పట్లోనే చెప్పారు. తనపై వచ్చిన ఆరోపణలతో రమేష్ జర్కిహోలి నాడే పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు సిట్ టీమ్ ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చింది.
మరిన్ని ఇక్కడ చూడండి : చిరంజీవి, ఎన్టీఆర్ చెప్పారని 4ఏళ్లు.. నేర్చుకున్నా..! యువహీరో తో ఇంట్రస్టింగ్ ఇంటర్వ్యూ:Hero Teja Sajja video.
ఈ టీవీ ధర వింటే…మూర్ఛపోవడం ఖాయం..సరికొత్త టెక్నాలజీ రూపొందించిన శాంసంగ్:Samsung The Wall Video
మంచుకొండల్లో చిక్కుకున్న యంగ్ హీరో.. అడ్వంచరస్ టూర్‌లో బిజీ బిజీ..: Navdeep Video.