Police Station: సింగం 2 సినిమాను తలపించే సన్నివేశం.. పోలీస్ స్టేషన్ కు 50 మందితో వచ్చిన గుంపు ఏం చేసిందంటే

సినిమాలో జరిగినట్లు నిజ జీవితంలో సన్నివేశాలు జరగవు అంటారు. కానీ మధ్యప్రదేశ్ లో జరిగిన ఓ ఘటన మాత్రం అచ్చం తమిళ సూపర్ స్టార్ సూర్య నటించిన సింగం 2 సినిమాను తలపించింది.

Police Station: సింగం 2 సినిమాను తలపించే సన్నివేశం.. పోలీస్ స్టేషన్ కు 50 మందితో వచ్చిన గుంపు ఏం చేసిందంటే
Police Station

Updated on: Apr 08, 2023 | 4:12 PM

సినిమాలో జరిగినట్లు నిజ జీవితంలో సన్నివేశాలు జరగవు అంటారు. కానీ మధ్యప్రదేశ్ లో జరిగిన ఓ ఘటన మాత్రం అచ్చం తమిళ సూపర్ స్టార్ సూర్య నటించిన సింగం 2 సినిమాను తలపించింది. ఓ గుంపు పోలీస్ స్టేషన్ లోకి ప్రవేశించి పోలీసులపై దాడి చేసి ముగ్గరు ఖైదీలను విడిపించారు. వివరాల్లోకి వెళ్తే..మధ్యప్రదేశ్ లోని బుర్హాన్ పూర్ జిల్లాలోని నేపానగర్ పోలీస్ స్టేషన్ లో శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయమలో నలుగురు పోలీసుల విధులు నిర్వహిస్తున్నారు. అలాగే ఆ స్టేషన్ లో ముగ్గురు ఖైదీలు కూడా ఉన్నారు.అయితే ఒక్కసారిగా ఆ సమయంలో దాదాపు 50 మంది ఉన్న గుంపు పోలీస్ స్టేషన్ లోకి ప్రవేశించారు.

పోలీసులు అడ్డుపడితే వారిపై దాడి చేసి కర్రలతో చితకబాదారు. దీంతో పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం ఖైదీగా ఉన్న హేమా మేగ్వాల్ తో పాటు మరో ఇద్దరు దోషుల్ని ఆ గుంపు జైలు నుంచి బయటకు తీసుకొచ్చారు. ఇదంతా అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్టు అయ్యింది. అయితే ఆ విషయం గురించి తెలుసుకున్న జిల్లా కలెక్టర్ భవ్య మిట్టల్, ఉన్నతాధికారులు నేపానగర్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. కొన్ని రోజుల క్రితం పోలీస్ స్టేషన్ వద్ద హేమా మేగ్వాల్ మరో ఇద్దరు సహాయకులతో విధ్వంసానికి పాల్పడటంతో వాళ్లను అరెస్టు చేశారు. అయితే తప్పించుకున్న ఖైదీలను, అక్కడికి వచ్చిన గుంపును గుర్తించేందుకు సీసీకెమెరాలో నమోదైన దృశ్యాలను పరిశీలిస్తున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.

అయితే గత నెలలో ఆ ప్రాంతంలో 150 మంది గిరిజనులు అక్రమంగా భూమిని ఆక్రమించారు. సమాచారం తెలుసుకున్న అటవీ అధికారులు అక్కడికి వచ్చారు. ఆ గిరిజనులు అటవీ అధికారులను రానివ్వకుండా ఉండేందుకు బాణాలు, బాంబులు , దేశీయ తుపాకులు ఉపయోగించారు. దీంతో ఇరువురికి ఘర్షణ చెలరేగింది. ఇందులో 13 మంది గాయపడ్డారు. భూమిని ఆక్రమించినవారు తమ ప్రజలేనని.. కానీ వారు తుపాకులు వినియోగించడాన్ని మేము వ్యతిరేకిస్తున్నామని అటవీశాఖ మంత్రి విజయ్ సింగ్ అన్నారు. భూములపై ఆశతో చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారని.. వాళ్లకు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఒకవేళ వాళ్లు అంగీకరించకపోతే కఠినమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..