Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: ప్రభుత్వంపై ప్రజల్లో పెల్లుబిక్కిన ఆగ్రహం.. మోకాల్లోతూ నీటిలోనే భారీ ర్యాలీ..

తమ సమస్యను పరిష్కారించాలంటూ అక్కడి ప్రజలు ఏళ్ల తరబడి ఉద్యమం చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వంలో మాత్ర చలనం లేదు. ఎన్ని ప్రభుత్వాలు మారినా ప్రజల ఇబ్బందులు తొలగడంలేదు. గతంలో ఎన్నోసార్లు ఆందోళనలు చేసినా సమస్య పరిష్కరిస్తామంటూ..

Viral News: ప్రభుత్వంపై ప్రజల్లో పెల్లుబిక్కిన ఆగ్రహం.. మోకాల్లోతూ నీటిలోనే భారీ ర్యాలీ..
Candel Rally
Follow us
Amarnadh Daneti

|

Updated on: Aug 23, 2022 | 5:22 PM

Viral News: తమ సమస్యను పరిష్కారించాలంటూ అక్కడి ప్రజలు ఏళ్ల తరబడి ఉద్యమం చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వంలో మాత్ర చలనం లేదు. ఎన్ని ప్రభుత్వాలు మారినా ప్రజల ఇబ్బందులు తొలగడంలేదు. గతంలో ఎన్నోసార్లు ఆందోళనలు చేసినా సమస్య పరిష్కరిస్తామంటూ హామీ ఇచ్చిన అధికారులు.. ఆతర్వాత దానిని మర్చిపోవడంతో స్థానికుల్లో ఆగ్రహం పెల్లుబిక్కింది. దీంతో భారీ వర్షాలతో నీటి ప్రవాహంతో నిండిపోయిన రహదారిపై కొవ్వత్తుల ప్రదర్శన నిర్వహించి తమ ఆవేదనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన సంఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది.

రాజస్థాన్ లోని సికార్ నగరంలోని నవాల్‌ఘర్ రోడ్డు ప్రాంతంలో వర్షపు నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు అదే మురికి నీటిలో నుంచి బయటకు వస్తూ కొవ్వొత్తుల ప్రదర్శనతో భారీ ర్యాలీ చేపట్టారు. సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఏళ్ల తరబడి ఆందోళనలు చేస్తున్నా ఫలితం లేదంటూ తీవ్ర ఆగ్రహంతో ఉన్న స్థానిక ప్రజలు, వ్యాపారులు చౌదరి చరణ్ సింగ్ గేట్ నుండి కళ్యాణ్ సర్కిల్ వరకు ప్రదర్శన నిర్వహించారు. రహదారిపై మోకాల లోతు నీరుండగానే.. వరదనీటిలోనే సాగి దక్‌బంగ్లా రోడ్డు మీదుగా ప్రజలు భారీ ప్రదర్శన నిర్వహించారు. తక్షణమే తమ సమస్యను పరిష్కరించాలని కోరుతూ ప్రజలు నినాదాలు చేశారు. గత కొద్ది రోజులుగా భారీగా కురుస్తున్న వర్షాలతో రహదారులపై భారీగా వరద ప్రవహిస్తోంది. రహదారులపై వర్షపు నీరు వెళ్లేందుకు సరైన వ్యవస్థ లేకపోవడంతో ఇక్కడి ప్రజలు ఏళ్ల తరబడి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.

ఇవి కూడా చదవండి

సికార్ నగరంలోని ప్రధానమైన నవాల్ ఘర్ రోడ్డు రాజస్థాన్ లోని ముఖ్యమైన ప్రాంతాలను అనుసంధానం చేస్తుంది. ఈఏడాది జూన్ నుంచి ఆగష్టు 20 వరకు సాధారణంగా 404.02 మి.మీ వర్షపాతం నమోదవుతుందని జలవనరుల శాఖ అధికారులు అంచనా వేశారు. అయితే 27.5 శాతం అధికంగా 515.25 మి.మీ వర్షపాతం నమోదైంది. కొద్ది రోజులుగా రాజస్థాన్ లోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో ఉత్తర భాగంలో ఉన్న సికార్ నగరంలోని ప్రధాన రహదారులన్నీ వర్షపు నీటితో మునిగిపోయాయి. దీంతో ప్రజల జీవనం అస్తవ్యస్తమైంది. దీంతో సికార్ నగరంలోని ప్రజల్లో ఆగ్రహం తీవ్రస్థాయికి చేరుకోవడంతో స్థానిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా మోకాల లోతు నీటిలోనే ఆందోళన నిర్వహించారు. ఈవీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..