Bharat Gaurav tourist train: శ్రీరాముడు నడయాడిన ప్రాంతాలను కలుపుతూ భారత్ గౌరవ్ పర్యాటక రైలు ప్రారంభమైంది. శ్రీరామాయణ యాత్ర పేరిట స్టార్ట్ చేసిన ఈ రైలును కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి మంగళవారం ప్రారంభించారు. భారత్-నేపాల్ మధ్య నడిచే మొట్ట మొదటి పర్యాటక రైలు ఇది. శ్రీరాముడు జన్మించిన ప్రాంతం నుంచి మొదలై, ఆయన జీవితానికి సంబంధించిన, నడయాడిన అనేక ముఖ్య ప్రాంతాలను కలుపుతూ ఈ ట్రైన్‌ను ప్రారంభించారు. 18రోజులపాటు సాగనున్న శ్రీ రామాయణ యాత్రా రైలు.. ఢిల్లీలోని సప్ధర్‌జంగ్ రైల్వేస్టేషన్ నుంచి మొదలైంది. ఈ ట్రైన్.. అయోధ్య, బక్సర్, సీతామర్షి, జనక్‌పూర్, వారణాసి, ప్రయాగ్‌రాజ్, చిత్రకూట్, నాసిక్, హంపి, రామేశ్వరం, కాంచీపురం, భద్రాచలం లాంటి పుణ్యక్షేత్రాలు తిరుగుతూ తిరిగి ఢిల్లీకి చేరుకుంటుంది.
యాత్ర పొడవునా పర్యాటకులకు భోజనం, వసతి సదుపాయాలు, ట్రావెల్ ఇన్సూరెన్స్, సెక్యూరిటీ, గైడ్స్.. లాంటి ఫెసిలిటీస్ కల్పించారు. ఈ రైలులో మొత్తం 14 కోచ్‌లు ఉండగా, 6వందల మంది ప్రయాణించేలా ఏర్పాట్లు చేశారు. అయితే, ఢిల్లీ నుంచి స్టార్ట్ అయిన తొలి ప్రయాణంలో 5వందల మంది యాత్రికులు మాత్రమే ప్రయాణం చేస్తున్నారు. ఈ ట్రైన్‌లో కోచ్‌లన్నీ ఏసీ-త్రీ టైర్ సౌకర్యంతో నిర్మించారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా రైలును తీర్చిదిద్దారు. పురాతన కట్టాలు, ఆలయాలు, నృత్య రూపాలు, వంటకాలు, యుద్ధ కళలు, జానపద కళలు చిత్రాలతో ట్రైన్‌ను సుందరంగా తీర్చిదిద్దారు.
Along with Hon Union Minister @RailMinIndia Shri @AshwiniVaishnaw ji flagged of The Bharat Gaurav Train from New Delhi.
‘Shri Ramayana Yatra’, the 18-day pilgrimage tour by Bharat Gaurav Train will cover important & sacred places associated with the life of Prabhu Shri Rama. pic.twitter.com/Ue3bahNh2E
— G Kishan Reddy (@kishanreddybjp) June 21, 2022
దేశంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రధాని మోదీ ఆలోచనలకు అనుగుణంగా భారత్ గౌరవ్ రైళ్లను తీసుకొస్తున్నారు. ఈ స్కీమ్ కింద 3500 కోచ్‌లను అందుబాటులోకి తెస్తున్నారు. చారిత్రక, సాంస్కృతిక, పర్యాటక, ఆధ్యాత్రిక ప్రాంతాలను కలుపుతూ ఈ రైళ్లను నడుపనున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..