కస్టడీ నుంచి నేరస్థులు పారిపోవడానికి యత్నిస్తే పోలీసులు వారిపై కాల్పులు జరపాలని అస్సాం సీఎం హిమంత్ బిశ్వ శర్మ పోలీసులకు సూచించారు. కానీ వారి కాళ్లపై షూట్ చేయాలన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడినప్పుడు పోలీసులు తమ సెల్ఫ్ ఇంట్రెస్ట్ కి కాకుండా ప్రజల మంచికోసమన్న విషయన్ని గుర్తుంచుకోవాలని ఆయన హితవు చెప్పారు. నేరస్థులు తప్పించుకోవడానికి యత్నించినప్పుడు పోలీసులు వారిపై కాల్పులు జరపడం ఓ ‘ నమూనా’ మాదిరి మారిందని, ఇది సముచితమేనా అని కొందరు వ్యక్తులు తనను ప్రశ్నించారన్నారు. కానీ క్రిమినల్స్ ఛాతీపై కాకుండా వారి కాళ్లపై షూట్ చేయడమే సముచితమని, చట్టం దీన్ని సమ్మతిస్తుందని వారికీ చెప్పానని శర్మ వెల్లడించారు. ఎన్ కౌంటర్ ఘటనలు పెరిగిపోతున్నాయని ఆ వ్యక్తులు తన వద్ద ఆందోళన వ్యక్తం చేశారని హోమ్ మంత్రిత్వ శాఖను కూడా చూస్తున్న శర్మ పేర్కొన్నారు. అమాయకులపై ఈ విధమైన చర్యలు చేపట్టరాదని ఆయన సూచించారు. కస్టడీ నుంచి పారిపోతూ నిందితులు ఖాకీల చేతుల్లోనుంచి రైఫిల్ లాక్కుని పోతున్న ఘటనలు చూస్తున్నాం అని ఆయన చెప్పారు. అందువల్లే చట్టం ఏం చెబుతోందన్న విషయాన్ని మీరు మొదట గుర్తుంచుకోవాలని.. విచక్షణా రహితంగా షూట్ చేయరాదని పేర్కొన్నారు.
కాగా ఈ ముఖ్యమంత్రి చేసిన సూచనల్లో అర్థం లేదని విపక్షాలు, మానవ హక్కుల సంఘాలు ఆరోపించాయి.కేసులను పరిష్కరించడానికి తగిన దర్యాప్తు జరపకుండా నిందితులపై కాల్పులు జరపడమంటే అది పోలీసులను ప్రోత్సహించినట్టే అవుతుందని, నిజానికి కోర్టులు కేసులను పరిష్కరిస్తాయన్న విషయాన్ని విస్మరించరాదని ఈ సంఘాలు పేర్కొన్నాయి. ఒక వ్యక్తి నిందితుడా..కాదా అన్న అంశాన్ని న్యాయస్థానాలే నిర్ణయిస్తాయన్నారు. చట్టం అంటూ ఒకటుంది కదా అన్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి :మెడలో నాగుపాము..సైకిల్ పై సవారీ..చుస్తే షాక్ అవుతారు..!వైరల్ అవుతున్న వీడియో..:snake on neck viral video.