MLA Prakash Surve Comments: శివసేన పార్టీ, గుర్తు హక్కులపై అటు ఉద్ధవ్ ఠాక్రే వర్గం, ఇటు తిరుగుబాటు నేత షిండే మద్దతుదారుల మధ్య వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో థాక్రే వర్గాన్ని హెచ్చరిస్తూ సీఎం ఏక్‌నాథ్ షిండే మద్దతుదారుడు, మగథానే ఎమ్మెల్యే ప్రకాష్ సర్వే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అడ్డోస్తే వాళ్ల కాళ్లు విరగ్గొట్టండి.. అవసరమైతే బెయిల్ ఇప్పిస్తానంటూ.. థాక్రే వర్గాన్ని ఉద్దేషిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ప్రకాష్ సర్వే చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఎమ్మెల్యే వ్యాఖ్యలు మహారాష్ట్రలో మరోసారి రాజకీయ దుమారానికి దారితీశాయి. ముంబైలోని మాగాఠణే ప్రాంతంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రకాశ్ సుర్వే శివసేనలో విభేదాల గురించి మాట్లాడారు. ఎవరిది నిజమైన శివసేన? దీని గురించి ఎవరైనా ఏమైనా చెబితే గట్టిగా జవాబు చెప్పండి.. ఎవరి దాదాగిరీని సహించేది లేదు.. అవసరమైతే వారిని కొట్టండి. వినకపోతే.. వాళ్ల చేతులు విరగ్గొట్టలేకపోతే, కాళ్లు విరగ్గొట్టండి.. మీకు బెయిల్ ఇప్పించేందుకు మరుసటిరోజే వస్తా.. మీవెంట ప్రకాశ్ సుర్వే ఉన్నాడంటూ.. కార్యకర్తలకు సూచించారు. తాము ఎవరి జోలికీ వెళ్లమని, కానీ తమ జోలికి వస్తే మాత్రం వదిలిపెట్టబోమంటూ ఉద్ధవ్ థాక్రే వర్గాన్ని హెచ్చరించారు.
या व्हिडिओमध्ये बोलणारी व्यक्ती आम. प्रकाश सुर्वे जाहीरपणे हातपाय तोडण्याची, कापून काढण्याची कोथळा बाहेर काढण्याची भाषा करत आहेत.
गृहमंत्रालय स्थापित झाले असेल तर अशा गावगुंडांचे सदस्यत्व अजुन का अबाधित आहे हे सांगावे. @Dev_Fadnavis @mieknathshinde @SaamanaOnline @OfficeofUT pic.twitter.com/YDIbLYXtAo ఇవి కూడా చదవండి— Andhare Sushama (@andharesushama) August 15, 2022
దీనికి సంబంధించిన వీడియో మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై ఉద్ధవ్ థాక్రే వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యే ప్రకాశ్ సుర్వేపై ఉద్ధవ్ అనుచరులు దహిసర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై థాక్రే వర్గంతో పాటు ప్రతిపక్ష ఎన్సీపీ మంగళవారం మీడియా సమావేశం నిర్వహించనుంది. అటు సీఎం శిండే కూడా మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. సుర్వే వ్యాఖ్యలతో మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి వేడెక్కాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..