Petrol One Rupee: బంపర్‌ ఆఫర్‌.. రూపాయికే లీటర్‌ పెట్రోల్‌.. బారులు తీరిన వాహనదారులు.. ఎక్కడో తెలుసా..?

Petrol One Rupee: దేశంలో పెట్రోలక్ష్‌, డీజిల్‌ ధరలు మండిపోతున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో పెట్రోల్‌ రేటు సెంచరీ దాటింది. దీంతో వాహ‌నాలు బ‌య‌ట‌కు తీసేందుకు..

Petrol One Rupee: బంపర్‌ ఆఫర్‌.. రూపాయికే లీటర్‌ పెట్రోల్‌.. బారులు తీరిన వాహనదారులు.. ఎక్కడో తెలుసా..?

Updated on: Jun 14, 2021 | 2:14 PM

Petrol One Rupee: దేశంలో పెట్రోలక్ష్‌, డీజిల్‌ ధరలు మండిపోతున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో పెట్రోల్‌ రేటు సెంచరీ దాటింది. దీంతో వాహ‌నాలు బ‌య‌ట‌కు తీసేందుకు సామాన్య జనాలు భయపడుతున్నారు. అయితే మహారాష్ట్రలోని ఓ పెట్రోల్‌ బంక్‌లో లీటర్‌ పెట్రోల్‌ను రూపాయికే అందించారు. ఏంటి వంద రూపాయలు ఉన్న పెట్రోల్‌ రూపాయికే ఎలా ఇస్తారనేగా మీ అనుమానం. అసలు విషయం ఏంటంటే.. మహారాష్ట్ర మంత్రి ఆదిత్యానాథ్‌ థాక్రే పుట్టిన రోజు సందర్భంగా డోంబివ‌లీ యువ‌సేన ఠాణేలోని ఓ పెట్రోల్ బంకులో రూపాయికే పెట్రోల్‌ను అందించారు. దీంతో పెట్రోల్ కోసం వాహ‌న‌దారులు కిలోమీట‌ర్ల మేర బారులు తీరారు. ఉదయం 10గంటల నుండి 12 గంటల వరకూ రెండు గంటల పాటు రూపాయికి లీటర్ పెట్రోల్ పంపిణీ చేశారు.

వందలాది మంది వాహనదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. మరోవైపు మహారాష్ట్ర అంబర్‌నాథ్ లో శివసేన నేత అరవింద్ వాలేకర్ రూ.50లకే లీటర్ పెట్రోల్‌ను అందించే కార్యక్రమం చేపట్టారు. విమ్కో నాకా పెట్రోల్ బంక్ లో ఉదయం 11 గంటల నుండి ఒంటి గంట వరకూ పెట్రోల్ పంపిణీ చేశారు. లాక్‌డౌన్‌ కారణంగా రైళ్ల రాకపోకలు లేకపోవడంతో తమ సొంత వాహనాల ద్వారా వెళ్తున్నామని, రోజూ ముంబైకి వెళ్లి రావడానికి మూడు నుంచి నాలుగు లీటర్ల పెట్రోల్ అవసరమవుతుంది. దీని ధర సుమారు 400 రూపాయలు అవుతుంది’ అని శివసేన కార్పొరేటర్ దీపేశ్ మత్రే చెప్పారు.

మొదట ఈ కార్యక్రమాన్ని ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు చేయాలనుకున్నారు. రూపాయికే లీటర్ పెట్రోల్ పంపిణీని మొదట 500 మందికే ఇవ్వాలనుకున్నారు. కానీ, ఈ ఆఫర్ తెలియడంతో.. స్థానిక ప్రజలు ఒక్కసారిగా ఎగబడ్డారు. జనసమూహం పెరగడంతో మరో రెండు గంటలపాటు సమయాన్ని పెంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పంపిణీ చేశారు. ప్రస్తుతం ముంబైలో లీటరు పెట్రోల్ ధర 102 రూపాయలకు చేరుకుంది.

ఇవీ కూడా చదవండి:

Toyota Cars: టయోటా కార్లపై భారీ ఆఫర్లు.. రూ.75 వేల వరకు ఆదా చేసుకోవచ్చు.. ఈ నెల 30 వరకు అవకాశం

Gold Hallmarking: కేంద్రం కీలక నిర్ణయం.. బంగారు నగల అమ్మకాలకు రేపటి నుంచి హాల్ మార్క్ రూల్‌ తప్పనిసరి