ఆగ్రాలో అయిదేళ్ల చిన్నారి ఆకలి చావు

పేదరికం, దుర్భర దారిద్య్రం ఓ చిన్నారిని కబళించింది. 5 ఏళ్ళ పాప ఆకలి చావుకు గురయింది. తమ బిడ్డ ఆకలితో మరణించిందని ఆమె తలిదండ్రులు చెబుతున్నప్పటికీ...

ఆగ్రాలో అయిదేళ్ల చిన్నారి ఆకలి చావు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 24, 2020 | 8:59 PM

పేదరికం, దుర్భర దారిద్య్రం ఓ చిన్నారిని కబళించింది. 5 ఏళ్ళ పాప ఆకలి చావుకు గురయింది. తమ బిడ్డ ఆకలితో మరణించిందని ఆమె తలిదండ్రులు చెబుతున్నప్పటికీ..జిల్లా అధికారులు మాత్రం ఆ పాప అనారోగ్యంతో మృతి చెందిందని అంటున్నారు. ఆ కుటుంబం చాలా పేద కుటుంబమని చెబుతున్నారు. అయితే ఆ తలిదండ్రుల రోదన మానవ హక్కుల కమిషన్ వరకు వెళ్లడంతో.. కమిషన్ యూపీ ప్రభుత్వానికి నోటీసును జారీ చేసింది. నాలుగు వారాల్లోగా దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. పేదరికంపై పోరుకు ఎన్నో రాష్ట్ర, కేంద్ర పథకాలు ఉన్నప్పటికీ ఈ చిన్నారి ఆకలి చావుకు గురి కావడం దారుణమని వ్యాఖ్యానించింది. కాగా.. ఆ పాపకు తాము పాలు పంపామని, అయితే డయేరియా కారణంగా ఆమె మరణించిందని కూడా అధికారులు పేర్కొంటున్నారు.