కాంగ్రెస్ నేత, ఎంపీ శశిథరూర్ దేశంలో పాపులర్ సీనియర్ నాయకుడు. మంచి పరిణతి గల వ్యక్తే గాక.. వాక్చాతుర్యం గల నేత కూడా. అయితే తన ట్వీట్లతో శశిథరూర్ అప్పుడప్పుడు నెటిజన్లను తికమక పెడుతుంటారు. అందుకు వారి నుంచి ట్రోల్ ని కూడా ఎదుర్కొంటుంటారు. తాజాగా తన ట్వీట్లలో ఆయన.. ఓ పెద్ద పొరబాటే చేశారు. దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీని ‘ ఇండియా గాంధీ ‘ గా పేర్కొన్నారు. పైగా తన సహచరులకు తప్పుడు సమాచారమిచ్చారు. గతంలో.. అమెరికాలో జరిగిన పబ్లిక్ ర్యాలీలో జవహర్లాల్ నెహ్రు, ఇందిరాగాంధీ పాల్గొన్నప్పుడు అశేష జనం వచ్చారని, అప్పుడు మేనేజిమెంట్ గానీ, మీడియా పబ్లిసిటీ గానీ లేవని అంటూ.. అది 1954 వ సంవత్సరమని అన్నారు.
అప్పట్లో వీరి పర్యటనకు ఎలాంటి ప్రచారమూ లేదన్నారు. అయితే అది అమెరికాలో జరిగినప్పటి ర్యాలీ కాదని, ఆ సంవత్సరం కూడా తప్పని తేలింది. ఇందిరాగాంధీ ని ‘ ఇండియాగాంధీ ‘ గా థరూర్ పేర్కొన్నారు. కాగా- 1956 లో మాస్కోలో జరిగిన ర్యాలీలో నెహ్రు, ఇందిర పాల్గొన్నప్పటి ఫోటో ఇది.. మీరు పూర్తిగా సీన్ మార్చేశారని అంటూ ఆర్.జగన్నాథన్ అనే జర్నలిస్టు తన ట్వీట్లో తెలిపారు. కానీ ఈ జర్నలిస్టు పేర్కొన్న సంవత్సరం కూడా తప్పేనట.. 1955 లో నెహ్రు, ఇందిర రష్యాలోని మాగ్నిటోగోర్స్ అనే పట్టణాన్ని విజిట్ చేసినప్పటి ఫోటో ఇదని ఆ తరువాత తెలిసింది. వాళ్లిద్దరూ ఆ ఏడాది అప్పటి సోవియట్ యూనియన్ లో ఉన్నారని వెల్లడైంది. ఏమైనా.. శశిథరూర్ గారి బ్లండర్స్ మీద నెటిజన్లు తమ ‘ దూకుడు ‘ ప్రారంభించారు. రకరకాలుగా నెట్టింట్లో సెటైర్లు వేస్తూ ‘ ఆడుకున్నారు ‘.
Nehru & India Gandhi in the US in 1954. Look at the hugely enthusiastic spontaneous turnout of the American public, without any special PR campaign, NRI crowd management or hyped-up media publicity. pic.twitter.com/aLovXvCyRz
— Shashi Tharoor (@ShashiTharoor) September 23, 2019
You are a liar. This photo is not from the United States.
Jawaharlal Nehur and his Daughter Indira in Moscow – 1956@ShefVaidya @rahulroushan @Being_Humor https://t.co/gJovnfVZVj
— ?ℳɑŋσj ℛɑŋε? (@Marathi_Tweets) September 23, 2019