
ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్సీపీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలని పవార్ నిర్ణయించారు. గత కొంతకాలంగా ఎన్సీపీలో అంతర్గత కుమ్ములాటు పెరిగినట్టు ప్రచారం జరుగుతోంది. శరద్‌పవార్ సోదరుడి కుమారుడు అజిత్ పవార్ పార్టీపై తిరుగుబాటు చేస్తారని జోరుగా ఊహాగానాలు విన్పిస్తున్న సమయంలో శరద్‌పవార్ ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే శరద్‌పవార్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఎన్సీపీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. మహారాష్ట్రలో మహావికాస్ అఘాడి కూటమిలో కీలకపాత్ర పోషిస్తున్నారు శరద్‌పవార్ . ఆయన పార్టీ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకోవడంతో ఎంవీఏ కూటమి భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. మరోవైపు బీజేపీపై పోరాటంలో.. విపక్షాలను ఒకే తాటి మీదకు తెచ్చేందుకు పవార్ ఎంతో కృషి చేస్తున్నారు. ఇలాంటి సమయంలోనే ఆయన పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకుని అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు.
ఇక గత కొంతకాలంగా.. మహారాష్ట్రలో రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పవార్ అన్న కొడుకు, మహారాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఎన్సీపీపై తిరుగుబాటు చేస్తున్నారన్నప్రచారం బాగా జరుగుతోంది. తనకు అనుకూలంగా ఉన్న ఎమ్మెల్యేలతో బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారంటూ తెలుస్తోంది. అయితే అజిత్ పవార్ ఆ ప్రచారాన్ని ఖండించారు. ఇలా బాబాయ్-అబ్బాయ్ నడుమ గ్యాప్ గురించి చర్చ జరుగుతుండగానే పవార్ పార్టీ చీఫ్ పదవికి రాజీనామా ప్రకటించడం కొసమెరుపు
#WATCH | “I am resigning from the post of the national president of NCP,” says NCP chief Sharad Pawar pic.twitter.com/tTiO8aCAcK
— ANI (@ANI) May 2, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం.. క్లిక్ చేయండి..