Shahi Imam seeks PM Narendra Modi’s help: ఢిల్లీ జామా మసీదు షాహీ ఇమామ్ సయ్యద్ అహ్మద్ బుఖారి ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు. ఢిల్లీలోని చారిత్రాత్మక జామా మసీదుకు మరమ్మతు పనులు చేపట్టేలా కేంద్ర పురావస్తు శాఖను ఆదేశించాలని సయ్యద్ అహ్మద్ బుఖారి.. ప్రధాని నరేంద్రమోదీని కోరారు. అంతర్జాతీయంగా ఖ్యాతి గడించిన జామా మసీదు సంరక్షణ చాలా అవసరమని ఆయన లేఖలో పేర్కొన్నారు. 1956 వ సంవత్సరం నుంచి కేంద్ర పురావస్తుశాఖ మసీదు మరమ్మతులను ప్రత్యేకంగా చూస్తుందని షాహిఇమామ్ ప్రధాని మోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన మసీదును సంరక్షించాలని బుఖారీ.. మోదీని అభ్యర్థించారు.
తాజాగా ఆదివారం మసీదులో కొన్ని రాళ్లు పడిపోయాయని, మసీదు శిథిలావస్థకు చేరిందన్నారు. ఇలా తరచూ రాళ్లు పడిపోతుండటాన్ని ఆయన ప్రస్తావించారు. మసీదులో పడిపోయిన రాళ్లు, వాటి వల్ల కలిగిన నష్టంపై అదేవిధంగా శిథిలమైన మినార్ల ఫొటోలను కూడా బుఖారి ప్రధానికి పంపించారు. మసీదుకు మరమ్మతులు చేయకపోతే.. ఘోర ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందన్నారు. రాళ్లు పడటం వల్ల చారిత్రాత్మక మసీదు బలహీనపడిందని బుఖారి పేర్కొన్నారు. జామా మసీదు స్మారక చిహ్నం, మినార్లను పరిశీలించి వాటి మరమ్మతులు ప్రారంభించేలా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాను ఆదేశించాలని బుఖారి ప్రధాని మోదీని కోరారు.
Also Read: