Watch: సిమెంట్‌ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. బొగ్గు శిథిలాల్లో చిక్కుకున్న కార్మికులు

నివేదికల ప్రకారం, ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మరణించారని తెలిసింది. చాలా మంది కార్మికులు బొగ్గు తొట్టి కింద చిక్కుకున్నందున మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలిసింది. బొగ్గు తొట్టి కింద 12 మందికి పైగా కార్మికులు పనిచేస్తుండగా ఈ ఘటన జరిగింది. తొట్టి ఒక్కసారిగా కుప్పకూలడంతో కార్మికులు బొగ్గు కింద చిక్కుకుపోయారు. వారిలో కొందరు మహిళలు కూడా ఉన్నట్టు తెలిసింది.

Watch: సిమెంట్‌ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. బొగ్గు శిథిలాల్లో చిక్కుకున్న కార్మికులు
Coal Hopper Collapses

Updated on: Jan 17, 2025 | 1:08 PM

ఒడిశాలోని సుందర్‌ఘర్ జిల్లా రాజ్‌గంగ్‌పూర్‌లోని సిమెంట్ ఫ్యాక్టరీలో పెను ప్రమాదం సంభవించింది. ఫ్యాక్టరీలో బొగ్గు తొట్టి కూలిపోవడంతో పలువురు కార్మికులు బొగ్గు కింద చిక్కుకుపోయారు. స్థానికులు, సిబ్బంది సమాచారం మేరకు సహాయక బృందాలు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. బొగ్గు కింద చిక్కుకుపోయిన కార్మికులను బయటకు తీసేందుకు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.

నివేదికల ప్రకారం, ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మరణించారని తెలిసింది. చాలా మంది కార్మికులు బొగ్గు తొట్టి కింద చిక్కుకున్నందున మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలిసింది. బొగ్గు తొట్టి కింద 12 మందికి పైగా కార్మికులు పనిచేస్తుండగా ఈ ఘటన జరిగింది. తొట్టి ఒక్కసారిగా కుప్పకూలడంతో కార్మికులు బొగ్గు కింద చిక్కుకుపోయారు. వారిలో కొందరు మహిళలు కూడా ఉన్నట్టు సమాచారం.

ఇవి కూడా చదవండి

జేసీబీ యంత్రాలు, ఇతర ఉపకరణాలతో కూడిన రెస్క్యూ టీమ్‌లు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నాయి. ప్రమాదంలో చిక్కుకుపోయిన కార్మికులను రక్షించేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నారు.

ఇదిలా ఉంటే, ప్రమాదం గురించి తెలుసుకున్న జిల్లా యంత్రాంగం కూడా ఫ్యాక్టరీ వద్దకు చేరుకుంది. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఇలాంటి ఫ్యాక్టరీ మేనేజర్, షిఫ్ట్, సేఫ్టీ ఇన్‌చార్జిని అరెస్టు చేయాలని పలువురు డిమాండ్ చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..