Bomb Threat: దేశంలోని పలు ఎయిర్‌పోర్ట్‌లకు బాంబు బెదిరింపులు.. హై అలెర్ట్..

|

Jun 18, 2024 | 6:56 PM

దేశంలోని ప్రముఖ విమానాశ్రయాలు బాంబు బెదిరింపులతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. వెంటనే రంగంలోకి దిగిన భద్రతా సిబ్బంది ముమ్మర తనిఖీలు చేపట్టారు. బాంబు బెదిరింపుల కారణంగా విమానాల రాకపోకలు ఆలస్యమయ్యాయి.

Bomb Threat: దేశంలోని పలు ఎయిర్‌పోర్ట్‌లకు బాంబు బెదిరింపులు.. హై అలెర్ట్..
Airport Bomb Threat
Follow us on

దేశంలోని పలు ఎయిర్‌పోర్ట్‌లను పేల్చేస్తామని దుండగుల నుంచి బెదిరింపు ఈ-మెయిల్‌ వచ్చాయి. దీంతో దేశమంతా హైఅలర్ట్‌ ప్రకటించారు. అన్ని ఎయిర్‌పోర్ట్‌ల్లో బాంబ్‌ స్క్వాడ్‌ తనిఖీలు చేపట్టింది. ప్రయాణికులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాతే ఎయిర్‌పోర్ట్‌ల్లోకి అనుమతి ఇస్తున్నారు. బాంబు బెదిరింపు కారణంగా విమానాల రాకపోకలు ఆలస్యమయ్యాయి. ఉదయం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరాల్సిన దుబాయ్ విమానానికి బాంబు బెదిరింపు ఈ- మెయిల్ వచ్చింది.

చెన్నై విమానాశ్రయానికి బాంబు బెదిరింపు ఈ-మెయిల్ రావడంతో చెన్నై-దుబాయ్ ఎమిరేట్స్ విమానం రెండు గంటలు ఆలస్యంగా బయలుదేరింది. కోయంబత్తూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు కూడా ఇదే రకమైన బాంబు బెదిరింపు ఈ-మెయిల్ వచ్చింది. బాంబు డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్ బృందం స్నిఫర్ డాగ్ స్క్వాడ్‌తో కలిసి సోదాలు నిర్వహించి బాంబు బెదిరింపు ఫేక్ అని నిర్ధారించింది. జైపూర్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపులు రావడంతో భద్రతా సిబ్బంది దర్యాప్తు చేపట్టారు. సోదాల తర్వాత కార్యకలాపాలు యథావిధిగా కొనసాగాయి. బాంబు బెదిరింపు రావడంతో వడోదర విమానాశ్రయంలో కూడా భద్రతను పెంచారు. అయితే గుర్తు తెలియని వ్యక్తి మధ్యాహ్నం పన్నెండున్నర సమయంలో దేశంలోని 40 విమానాశ్రయాలకు బాంబు బెదిరింపు ఈ-మెయిల్ పంపినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..