Ayodhya Deepotsav: రామ జన్మభూమి అయోధ్య వెలుగొంతుతోంది. దీపావళి సందర్భంగా అయోధ్య వెలుగులమయం అవుతోంది. దీపావళికి ఒక రోజు ముందు అంటే బుధవారం దీపోత్సవ్ నిర్వహిస్తోంది. అత్యధికంగా దీపాలను వెలిగించి ప్రపంచ రికార్డు సృష్టించేందుకు ఆయోధ్య రెడీ అవుతోంది. సరయు నదీ తీరంలో రామ్‌కీ పైడి ఘాట్‌లో 9 లక్షల దీపాలు వెలిగించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఉత్తరప్రదేశ్ సర్కార్ తెలిపింది. అత్యధికంగా దీపాలను వెలిగించి రికార్డు సృష్టించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయని పేర్కొంది. 9 లక్షల దీపాలతో పాటు అయోధ్య పట్టణం అంతా కూడా దీపాలు వెలిగించే కార్యక్రమాలను ఏర్పాటు చేశామని తెలిపింది. అయోధ్యతో పాటు ప్రపంచ వ్యాప్తంగా శుభాలు జరగాలని కోరుకుంటూ ఈ దీపాలు వెలిగించే కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపింది. అయితే గత కొన్ని రోజులుగా నదీ తీరంలో లేజర్ షోలు నిర్వహిస్తున్నారు. కాగా, ఆగస్టు 5న భారత ప్రధాని నరేంద్రమోదీ అయోధ్య రామ మందిరానికి భూమి పూజ చేసిన విషయ తెలిసిందే. సుప్రీం కోర్టు తీర్పుతో అయోధ్యలో భారీ రామాలయాన్ని నిర్మిస్తున్నారు. ఇది 2024 వరకు పూర్తి కానుంది.
ట్రాఫిక్ ఆంక్షలు..
దీపోత్సవ్ సందర్భంగా అయోధ్యలో ఆలయాన్ని అందంగా ముస్తాబు చేశారు. నగరాన్ని మొత్తం కూడా జిగేల్‌మంటోంది. అక్కడ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. ముందు జాగ్రత్త చర్యగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 2017లో యూపీలో అధికారంలోకి వచ్చిన బీజేపీ.. అప్పటి నుంచి ఏటా దీపోత్సవాన్ని కార్యక్రమాన్ని అంగరవంగా వైభవంగా నిర్వహిస్తోంది.
ఇవి కూడా చదవండి: