Omicron: ఒమిక్రాన్ ను ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్.. త్వరలో బూస్టర్ డోస్ గా ఇచ్చే ఛాన్స్.. సీరం సంస్థ కీలక ప్రకటన..
ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా.. అనేక వెరియంట్లలో వ్యాప్తి చెందుతూ ఉంది. కోవిడ్ నియంత్రణకు ఇప్పటికే అనేక వ్యాక్సిన్లు అందుబాటులోకి రాగా.. కరోనా కు చెందిన వివిధ వేరియేంట్లను
Coronavirus Omicron variant: ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా.. అనేక వెరియంట్లలో వ్యాప్తి చెందుతూ ఉంది. కోవిడ్ నియంత్రణకు ఇప్పటికే అనేక వ్యాక్సిన్లు అందుబాటులోకి రాగా.. కరోనా కు చెందిన వివిధ వేరియేంట్లను సమర్థంగా ఎదుర్కొనే వ్యాక్సిన్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించిన ప్రయోగాలు జరుగుతున్నాయని సీరం ఇనిస్టిట్యూట్ (Serum institute) ప్రకటించింది. కరోనా నియంత్రణకు కోవిషీల్డ్ టీకా రూపొందించిన సీరం సంస్థ తాజాగా ఒమిక్రాన్ ను ఎదుర్కొనే వ్యాక్సిన్ తయారీపై దృష్టిసారించింది. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ ఉధృతి తగ్గుతున్నట్లు కనిప్పిస్తున్నా.. పలు దేశాల్లో కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి. దీంతో వాటిని ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ల అభివృద్ధి తప్పనిసరవుతోంది. ఈక్రమంలో ఒమిక్రాన్ ను ఎదుర్కొనే టీకా పై ప్రయోగాలు సాగుతున్నాయని.. త్వరలోనే వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకొస్తామని సీరం ఇనిస్టిట్యూట్ సీఈఓ అదర్ పూనావాలా వెల్లడించారు. వచ్చే 6నెలల్లో ఈవ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశముందని తెలిపారు.
కోవిడ్ నియంత్రణలో భాగంగా ఇప్పటికే రెండు టీకాలు తీసుకున్నవారికి బూస్టర్ డోసు వేస్తున్నారు. ఒమిక్రాన్ పై పనిచేసే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే బూస్టర్ డోస్ గా ఆ టీకా అందిస్తే ఎంతో మేలని సీరం సంస్థ సీసీఈఓ అదర్ పూనావాలా పేర్కొన్నారు. ఒమిక్రాన్ పై పోరాడే వ్యాక్సిన్ కోసం నోవావాక్స్ తో కలిసి పనిచేస్తున్నామని.. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఏ 5పై సమర్థంగా పోరాడే టీకాను త్వరలో తీసుకువస్తామని తెలిపారు. నోవావాక్స్ ప్రయోగాలు ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్నాయని, నవంబర్, డిసెంబర్ నాటికి అనుమతి కోసం అమెరికా నియంత్రణ సంస్థను సంప్రదించే సూచనలు కనిపిస్తున్నాయని అదర్ పూనావాలా వివరించారు. ఒమిక్రాన్ వేరియంట్ ను ఈజీగా తీసుకోవద్దని సూచించిన ఆయన.. అది కాస్త సీరియస్ ఫ్లూగా పరిణమించే అవకాశం ఉందన్నారు. ఒమిక్రాన్ ను ఎదుర్కొనే టీకాను ఇప్పటికే మోడెర్నా రూపొందించగా.. దీని వినియోగానికి బ్రిటన్ ప్రభుత్వం తాజాగా ఆమోదం తెలిపింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..