Mumbai: ముంబైలో దాడి చేస్తాం.. ఎన్ఐఏ కి అగంతకుల మెయిల్.. అలర్ట్ అయిన భద్రతా సిబ్బంది..

|

Feb 03, 2023 | 11:04 AM

ముంబైలో మారణహోమం సృష్టిస్తామని గుర్తు తెలియని అగంతకులు కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ కి ఈమెయిల్ పంపారు. తాలిబాన్ సంస్థ ప్రధాన నాయకుడు సిరాజుద్దీన్ హక్కానీ ఆదేశాల ప్రకారం..

Mumbai: ముంబైలో దాడి చేస్తాం.. ఎన్ఐఏ కి అగంతకుల మెయిల్.. అలర్ట్ అయిన భద్రతా సిబ్బంది..
NIA
Follow us on

ముంబైలో మారణహోమం సృష్టిస్తామని గుర్తు తెలియని అగంతకులు కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ కి ఈమెయిల్ పంపారు. తాలిబాన్ సంస్థ ప్రధాన నాయకుడు సిరాజుద్దీన్ హక్కానీ ఆదేశాల ప్రకారం.. ముంబైలో భీకర దాడి జరుగుతుందని ఈమెయిల్‌లో పేర్కొన్నారు. ఈ అగంతక మెయిల్‌ నేపథ్యంలో అలర్ట్ అయిన ఎన్ఐఏ.. దేశ వ్యాప్తంగా భద్రతా దళాలను అప్రమ్తతం చేసింది. ముంబై పోలీసులు, ఇతర ఏజెన్సీలతో కలిసి దర్యాప్తు ప్రారంభించారు. బెదిరింపు మెయిల్ నేపథ్యంలో.. దేశ వ్యాప్తంగా ప్రధాన పట్టణాలు, నగరాలలో హై అలర్ట్ ప్రకటించారు. ఆయా రాష్ట్రాల పోలీసు శాఖలకు సమాచారాన్ని పంపించింది ఎన్ఐఏ.

రామజన్మభూమి కాంప్లెక్స్ పేల్చేస్తామంటూ..

రామజన్మభూమి స్థలాన్ని పేల్చేస్తామంటూ అగంతుకులు బెదిరింపులకు పాల్పడ్డారు. వెంటనే అలర్ట్ అయిన పోలీసు యంత్రాంగం.. అయోధ్యలో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. రామ్‌కోట్ ప్రాంతంలోని రాంలల్లా సదన్ ఆలయంలో నివసించే మనోజ్ అనే వ్యక్తికి అగంతకులు ఫోన్ చేసి, రామజన్మభూమి కాంప్లెక్స్‌ను పేల్చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. దాంతో అలర్ట్ అయిన మనోజ్.. విషయాన్ని వెంటనే పోలీసులకు తెలియజేశాడు. బెదిరింపు కాల్ నేపథ్యంలో అలర్ట్ అయిన పోలీసులు.. ఆలయం పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..