రెండో విడత పార్లమెంట్ బడ్జెట్(Budget Session Parliament) సమావేశాల సోమవారం ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు సభలు ఒకేసారి భేటీ కానున్నాయి. కోవిడ్ నిబంధనల(Covid Restrictions) ప్రకారం సమావేశాలు జరగనున్నాయి. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు విపక్షాలు రెడీ అవుతున్నాయి. ఈ విడతలో పలు అంశాలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. ఈ విడతలో పలు అంశాలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. ధరల పెరుగుదల, నిరుద్యోగం, రైతులకు కనీస మద్దతు ధర, ఉక్రెయిన్ నుంచి వచ్చిన వైద్య విద్యార్థులు వంటి కీలక అంశాలపై.. చర్చకు పట్టుబట్టాలని విపక్షాలు నిర్ణయించాయి. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత విజయోత్సాహంతో అధికార బీజేపీ, పరాజయ భారంతో కాంగ్రెస్, ఇతర విపక్షాలు ఈ సమావేశాల్లో ఉత్సాహంగా పార్లమెంట్‌కు రానున్నాయి.
ఏప్రిల్ 8 వరకు జరిగే ఈ సమావేశాల్లో ప్రభుత్వం అనేక కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది. జమ్ము కశ్మీర్ బడ్జెట్‌ను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం లోక్‌సభలో ప్రవేశపెడతారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై భారత వైఖరి, భారతీయుల తరలింపుపై విదేశాంగ మంత్రి జైశంకర్ పార్లమెంటుకు వివరిస్తారు.
బడ్జెట్ ప్రతిపాదనలకు పార్లమెంట్ ఆమోదం లభించేలా కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. లోక్‌సభలో షెడ్యూల్ తెగలకు సంబంధించిన సవరణ బిల్లును ఆమోదింపజేసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అదే సమయంలో జమ్ము కశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించిన బడ్జెట్‌ను కూడా పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది.
బడ్జెట్ సమావేశాల తొలి భాగం జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు జరిగింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఏప్రిల్ 8 వరకు రెండో విడత సమావేశాలు కొనసాగనున్నాయి.
ఇవి కూడా చదవండి: Iraq Rocket Attack: అమెరికాతో కయ్యానికి కాలుదువ్వుతున్న ఇరాన్.. ఇరాక్ లోని యూఎస్ ఎంబసీపై మిస్సైల్ దాడి..
Earthquake: ఆ రెండు దేశాల్లో భారీ భూకంపం.. భయాందోళనలో అక్కడి ప్రజలు..