Viral: పడవలోని పార్శిల్ సముద్రంలోకి .. స్కూబా డైవర్లు దాన్ని వెతికి ఓపెన్ చేయగా
గోల్డ్ స్మగ్లర్లు... బార్డర్లు దాటి బరితెగించి పోతున్నారు. కడుపు కోసుకుని పేగుల్లో దాచుకునిమరీ బంగారాన్ని దేశాలు దాటిస్తున్నారు మాయగాళ్లు. లేటెస్ట్‌గా విమానాలు కాదు.. సీమాంతర జలాల్లోకి మారింది గోల్డ్ స్మగ్లింగ్. శ్రీలంక నుంచి తమిళనాడుకి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని... సాహసోపేతంగా పోరాడి సీజ్ చేశారు కోస్ట్ గార్డ్స్.
సముద్రదొంగలు వర్సెస్ సముద్ర రక్షకులు.. ! కడలి గర్భంలో ఈ పోరాటం నిరంతరం జరిగే ఒక యుద్ధంలాంటిదే. విదేశీ స్మగ్లర్ల నుంచి మన తీరాన్ని కంటికిరెప్పలా కాపాడే నావికాదళం… ఆ దిశగా చాలాసార్లు సక్సెస్ కొట్టింది. లేటెస్ట్‌గా మరో సాహసోపేతమైన ఘట్టాన్ని విజయవంతంగా ముగించింది. 17.74 కిలోల బంగారం… అక్షరాలా 10 కోట్ల 50 లక్షల రూపాయల వ్యాల్యూ… శ్రీలంక టు తమిళనాడు… బార్డర్లు దాటించాలన్నది స్మగ్లర్ల కుట్ర. మరి… మనోళ్లు ఊరికే వదిలిపెడతారా..? మండపం తీరంలో గస్తీకాస్తున్న మన కోస్ట్‌గార్డుల కళ్లల్లో పడింది ఈ అనుమానాస్పద బోటు. వెంటనే ఛేజింగ్ షురూ.
కోస్ట్‌గార్డ్స్ కదలికల్ని గమనించిన స్మగ్లర్లు… అలర్ట్ అయ్యారు. బంగారం కార్టన్లను ఉన్నపళంగా సముద్రంలో పడేసి… ప్లాన్‌బీని వర్కవుట్ చేద్దామనుకున్నారు. నీళ్లల్లో మునిగిన బంగారం కోసం స్కూబా డైవర్స్‌ను రంగంలోకి దింపింది కోస్ట్‌గార్డ్స్. దాదాపు 24గంటలపాటు సముద్ర గర్భంలో సుదీర్ఘ అన్వేషణ తర్వాత గోల్డ్ హంట్‌కి తెర పడింది. గల్ఫ్ ఆఫ్ మయన్మార్‌లో నిఘా కోసం ఇటీవలే సముద్రంలో ప్రవేశపెట్టిన ఇంటర్‌సెప్టర్ బోట్ C-432దే … ఈ ఆపరేషన్‌లో క్రూషియల్ రోల్. హై స్పీడ్‌తో ఎస్కేప్ అవుతున్న అనుమానాస్పద పడవను ఈ వార్‌షిప్ మీదే వెంటాడారు మనోళ్లు. బంగారాన్ని సముద్రంలో పడేశాక.. డైవింగ్ ఆపరేషన్ మొదలైంది. ముగ్గురు స్కూబా డైవర్లు తిమింగళాల్లా వేటాడి… బంగారం డబ్బాల్ని ఒడ్డుకి చేర్చారు. కేవలం సినిమాల్లో మాత్రం చూడగలిగే ఈ సీన్ రియాలిటీలో కూడా సాధ్యమైంది.
కోస్ట్‌గార్డులంటే మాటలు కాదు… అందులోనూ స్కూ డైవింగ్‌లో మనోళ్లను కొట్టేవాళ్లే లేరు. సముద్ర జలాల్లో ఈదడం అంటే వాళ్లకు మంచినీళ్లు గటగటా తాగినంత ఈజీ. నీళ్లలోకి దూకారంటే.. అనుకున్నది కొట్టుకొచ్చేదాకా ఊరుకోరు. గతంలో ఇలాగే… క్వింటాళ్ల కొద్దీ కొకైన్ డంప్‌ను స్వాధీనం చేసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయ్. శ్రీలంక టు తమిళనాడు… వయా మండపం కోస్టల్ ఏరియా… ఈ స్మగ్లింగ్ రాకెట్‌ని కూడా స్కూబా డైవింగ్‌తోనే ముగించింది భారత నావికా దళం. ఇండియన్ కోస్ట్‌గార్డ్స్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్… కలిసి చేసిన కంబైన్డ్ ఆపరేషన్ ఇది. ఇండియన్ నేవీ సక్సెస్ స్టోరీల్లో ‘మండపం ఎపిసోడ్’ కూడా చేరిపోయిందిప్పుడు. లంక స్మగ్లర్లకు దడ పుట్టించిన డేర్‌ఫుల్ ఫీట్‌తో… ఈ మార్గంలో రెగ్యులర్‌గా జరిగే అక్రమ రవాణాకు చెక్ పడే ఛాన్సుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..