Cow Hug Day: కౌ హగ్ డే పిలుపు ఉపసంహరణ.. కేంద్రం కీలక నిర్ణయం.. ట్రెండింగ్ గా మారిన లేటెస్ట్ డెసిషన్..

ఫిబ్రవరి 14 న వాలెంటైన్స్ డే కు బదులుగా.. కౌ హగ్ డే జరుపుకోవాలన్న ప్రకటనను కేంద్రం ఉపసంహరించుకుంది. ఈ మేరకు యానిమల్‌ వెల్ఫేర్‌ బోర్డు ఆఫ్‌ ఇండియా గతంలో ఇచ్చిన ఆదేశాలను వెనక్కు తీసుకుంది...

Cow Hug Day: కౌ హగ్ డే పిలుపు ఉపసంహరణ.. కేంద్రం కీలక నిర్ణయం.. ట్రెండింగ్ గా మారిన లేటెస్ట్ డెసిషన్..
Cow Hug Day
Follow us
Ganesh Mudavath

|

Updated on: Feb 10, 2023 | 7:08 PM

ఫిబ్రవరి 14 న వాలెంటైన్స్ డే కు బదులుగా.. కౌ హగ్ డే జరుపుకోవాలన్న ప్రకటనను కేంద్రం ఉపసంహరించుకుంది. ఈ మేరకు యానిమల్‌ వెల్ఫేర్‌ బోర్డు ఆఫ్‌ ఇండియా గతంలో ఇచ్చిన ఆదేశాలను వెనక్కు తీసుకుంది. కేంద్ర మత్స్య, పశుసంవర్థక, డెయిరీ మంత్రిత్వశాఖ నుంచి అందిన ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు భారత జంతు సంరక్షణ బోర్డు కార్యదర్శి ఎస్‌కే దత్తా ఓ నోటీసులో తెలిపారు. అయితే… దేశంలోని గోవులను ప్రేమించేవారు ఫిబ్రవరి 14న ‘కౌ హగ్ డే’ని జరుపుకోవాలంటూ పిలుపునివ్వడం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాగా.. ఆవులు మన దేశ సంస్కృతీ సంప్రదాయాలకు, గ్రామీణ ఆర్థిక వ్యస్థకు వెన్నెముకగా యానిమల్ బోర్డు గతంలో పేర్కొంది. ఆవులను ఆలింగనం చేసుకోవడం ద్వారా దేహంలోకి పాజిటివ్‌ ఎనర్జీ ప్రవహించడంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని తెలిపింది. కాబట్టి గో ప్రేమికులందరూ.. కౌ హగ్‌ డే ను జరుపుకోవాలని విజ్ఞప్తి చేసింది.

కాగా.. కౌ హగ్‌ డే పై సానుకూల, విమర్శలతో ఈ అంశం సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌గా కొందరు వ్యంగ్యంగా మాట్లాడుతుండగా.. గో ప్రేమికులు మాత్రం ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. ఆవును అప్యాయంగా హత్తుకుంటే ఎన్నో ప్రయోజనాలు దక్కుతాయని సోషల్ మీడియాలో పలువురు పేర్కొంటున్నారు. బీపీ, శ్వాస సంబంధిత వ్యాధులతో పాటు పలు రకాల వ్యాధుల నుంచి ఉపశమనం పొందొచ్చని అంటున్నారు. మరోవైపు.. హర్యానాలోని గురుగ్రామ్‌కు చెందిన ఓ ఎన్‌జీవో గతేడాది దేశంలో తొలి ఆవు కౌగిలింత కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఆవులను స్పృశించడం, కౌగిలించుకోవడం, పక్కనే కూర్చోవడం, ఆవులకు జాగ్రత్తలు తీసుకోవడం వంటి యాక్టివిటీలు ఇక్కడ జరుగుతుంటాయి.

పాశ్చాత్య సంస్కృతి కారణంగా వేద మంత్రాలు కూడా వినబడకుండా పోతున్నాయని కేంద్రం ఆవేదన వ్యక్తం చేసింది. దేశ సంస్కృతిని కాపాడుకునేందుకు ఇలాంటివి జరుపుకోవాలని కోరింది. భారతీయులకు, గోవులకు ఉన్న విడదీయలేని అనుబంధాన్ని మరోసారి గుర్తు చేసేందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని పశు సంక్షేమ శాఖ తెలిపింది. అయితే.. ఈ నిర్ణయాన్ని ప్రస్తుతం ఉపసంహరించుకోవడం కూడా ట్రెండింగ్ గానే మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..