Dalphin: పిల్ల కాలువలో ప్రత్యక్షమైన డాల్ఫిన్.. డాల్ఫిన్ చూసేందుకు ఎగబడ్డ స్థానికులు. వైరల్ వీడియో..
సముద్రంలో, నదీ జలాల్లో ఉండాల్సిన డాల్ఫిన్ కాలువలో ప్రత్యక్షమైంది. కాకినాడ జిల్లా పెదపూడి కాలువలో డాల్ఫిన్ హల్‌చల్ చేసింది. పెదపూడి లోని బిక్కవోలులో ఓ డ్రైనేజీలో కనిపించిన
సముద్రంలో, నదీ జలాల్లో ఉండాల్సిన డాల్ఫిన్ కాలువలో ప్రత్యక్షమైంది. కాకినాడ జిల్లా పెదపూడి కాలువలో డాల్ఫిన్ హల్‌చల్ చేసింది. పెదపూడి లోని బిక్కవోలులో ఓ డ్రైనేజీలో కనిపించిన ఈ డాల్ఫిన్‌ను చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు. కాగా ఈ డాల్ఫిన్ సముద్రం నుంచి ఉప్పుటేరుద్వారా ఏలూరులోని పిల్ల కాల్వలోకి ప్రవేశించింది. కాల్వలో నీరు తక్కువగా ఉండటంతో నీటిలో ఆడుతున్న డాల్ఫిన్ ను గుర్తించిన స్థానిక మత్స్యకారులు సంబంధిత అధికారులకు సమాచారమిచ్చారు. ఈ వార్త ఆనోటా ఈనోటా ఆ ప్రాంతమంతా పాకింది. దాంతో డాల్ఫిన్‌ను చూసేందుకు పెద్దసంఖ్యలో ప్రజలు చేరుకున్నారు. మత్స్యకారుల సహాయంతో డాల్ఫిన్‌ను సముద్రంలో వదిలేందుకు ప్రయత్నించారు రెవెన్యూ, అటవీశాఖ అధికారులు. అయితే ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే..డాల్ఫిన్‌ను సముద్రం వద్దకు తీసుకెళ్లి నీటిలో వదిలే సమయానికి అది మృతి చెందింది. దాంతో పశుసంవర్ధకశాఖ వైద్యులతో పంచనామా జరిపించి పూడ్చిపెడతామని అటవీశాఖ అధికారులు తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.
Motehr and Son: నువ్వు సూపర్ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్ చూడాలని..
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

